Pawan Kalyan Secret Facts : పవన్ కళ్యాణ్ సీక్రెట్ ఫ్యాక్ట్స్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా.. స్ఫూర్తిదాయకంగానూ..

Published : Feb 19, 2022, 11:58 AM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎందరికో ఆదర్శప్రాయుడు.. సినీ రంగ ప్రవేశం నుంచి తను ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన ఘనత అంతాఇంతా కాదు. ఆయన గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఫ్యాక్ట్స్ చాలానే ఉన్నాయి. ప్రతి అభిమాని తప్పకుండా తెలుసుకోవాల్సిన వాస్తవాలివి..   

PREV
111
Pawan Kalyan Secret Facts : పవన్ కళ్యాణ్ సీక్రెట్ ఫ్యాక్ట్స్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా.. స్ఫూర్తిదాయకంగానూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Powerstar Pawan Kalyan) అసలు పేరు ‘కొణిదెల కళ్యాణ్ బాబు’. ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), యాక్టర్ నాగబాబు (Naga Babu)ల తమ్ముడు. ఏపీలోని బాపట్లలో కొనిదెల వెంకట రావు మరియు అంజనా దేవికి మూడో సంతానం. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శలో భాగంగా తన శిక్షణ సమయంలో తన పేరును ‘పవన్’గా  మార్చుకున్నాడు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గా పరిచయం అవుతూ వచ్చాడు. పవన్ కరాటేలో ‘బ్లాక్ బెల్డ్’ను కూడా పొందాడు. 
 

211

పవన్ దర్శకుడు కావాలనుకున్నాడు. అయితే, చిరంజీవి భార్య సురేఖ కొణిదల అతన్ని నటుడిగా మారడానికి ఒప్పించింది. అతను 1996లో అక్కడ ‘అమ్మాయి ఇక్కడ అబ్బాయితో’ అరంగేట్రం చేసాడు, ఇది ఖయామత్ సే ఖయామత్ తక్ యొక్క రీమేక్. తర్వాత నటించిన నాల్గొ చిత్రం ‘తొలి ప్రేమ’తో  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును పొందింది.  ఈ చిత్రం తర్వాత ‘తమ్ముడు’, బద్రి, ఖుషీ, జానీ, గుండుంబా శంకర్ వంటి సినిమాలతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 
 

311

ఇప్పటి వరకు 24 సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్ తాజాగా ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్  ‘గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, కుషి, జల్సా మరియు గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలలో నటించి ప్రసిద్ది చెందారు. అతని చిత్రం అత్తారింటికి దారేది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో పవన్ కళ్యాణ్ 2013, 2017 మరియు 2018లో వరుసగా 26, 69 మరియు 24వ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇఫ్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆరు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.
 

411

పవన్ కళ్యాణ్ నటుడుగానే కాకుండా నిర్మాతగా సర్దార్ గబ్బర్ సింగ్, ఛల్ మోహన్ రంగా మూవీలకు, దర్శకుడిగా జానీ సినిమాలకు పనిచేశాడు. అదే విధంగా ‘తమ్ముడు, బద్రి, ఖుషీ, డాడీ, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి’ మూవీలకు  స్టంట్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు. స్క్రీన్ రైటర్ గా గుడుంబా శంకర్ కు, రచయితగా జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కు పనిచేశారు. సింగర్ గా కూడా తన సినిమాలకు గాత్ర దానం చేశాడు. ‘తమ్ముడు, ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ సినిమాల్లోని మాస్ సాంగ్స్ పాడారు. పవన్ కళ్యాన్ పాడిన  సాంగ్స్ ఇప్పిటికీ యూత్ ఇష్టపడుతూనే ఉంటారు.   
 

511

పవన్ కళ్యాణ్ నందినిని 1997లో వివాహాం చేసుకున్నాడు. ఆ తర్వాత చట్టప్రకారం వీరిద్దరు 2007లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ 2007లోనే రేణు దేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరూ 2012లో విడాకులు తీసుకున్నాడు. 2013లో రష్యాకు చెందిన  ‘అన్నా లెజ్నెవా’ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తతం వీరి లైఫ్ సాఫీగా సాగుతోంది. రెండో భార్య రేణు దేశాయ్ చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్ ను డిజైన్ చేసింది.

611

పవన్ కళ్యాణ్ శాఖాహారి. తన లైఫ్ లో ప్రతి పనిని చాలా క్రమ శిక్షణతో చేస్తుంటాడు. అదేవిధంగా పెప్సీ క్యాంపెయిన్‌ను ఆమోదించిన మొదటి దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ప్రసిద్ధి చెందారు. పవన్ హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్‌లో ఎక్కువగా గడుపుతారు. పుస్తకాలు చదవడం, పండ్లు, కూరగాయలు పండించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. 
 
 

711

పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో అందరితోనూ స్నేహంగానే ఉంటారు. కానీ మహేశ్ బాబు (Mahesh Babu)తో మరింత స్నేహంగా ఉంటారంటా. అందుకే జల్సా సినిమాలోనూ పవన్ కళ్యాణ్ కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. మహేశ్ బాబు నటించిన ‘అర్జున్’మూవీ ఇంటర్నెట్‌లో లీక్ అయిన సందర్భంలోనూ మహేశ్ బాబుకు పవన్ కళ్యాన్ అండగా ఉన్నారు.  

811

పవన్ కళ్యాణ్ చేగువేరాకు వీరాభిమాని. ఈ విషయం అందిరికీ తెలిసిందే. ఇందుక కారణం ఎంటంటే.. పవన్ కళ్యాన్ తండ్రి ఒక కమ్యూనిస్ట్. ఎర్రజెండాకు మద్దతుగా పలు చిన్నతరహా పోరాట్లోనూ పాల్గొన్నాడంట. ఆయన తండ్రి ఆలోచనలా ప్రభావం పవన్ పైనా పడింది. తన పార్టీ టైటిల్ అక్షరాలు కూడా ‘ఎరుపు’ రంగులోనే ఉంటాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో ఏదోక సోషల్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాడు. యూత్ ను చైతన్యవంతం చేసే సాంగ్స్ కూడా ఉంటాయి. 
 

911

మెగాస్టార్ స్థాపించిన ‘ప్రజా రాజ్యం పార్టీ’లో 2‌008లోనే యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా తన పొలిటికల్ కేరీర్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ తో ప్రజా రాజ్యం పార్టీ మిళితమవడంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. 2014లో మళ్లీ ‘జనసేనా’ పార్టీని స్థాపించాడు.  2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్.

1011

నవంబర్ 2016లో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు మరియు అతను గాజువాక మరియు భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఏపీలోని హుద్‌హుద్ తుఫాను సమయంలోనూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు CMRFకి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు. 2013లోనూ ఉత్తరాఖండ్ లోని వరదలకు సాయంగా రూ. 20 లక్షలు అందించారు. 2012లో ఒలింపిక్ స్పోర్ట్స్ షూటర్ రేఖ చలిచెమలకు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షలు
అతను 2010 ఆల్ ఇండియా ఐఐటీ టాపర్ పృధ్వీ తేజ్‌కి ప్రేరణగా నిలిచాడు. 


 

1111

పవన్ కళ్యాణ్ నట జీవితంలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. గబ్బర్ సింగ్ మూవీతో 2012లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా పేరుపొందారు.  అదే సినిమాకు ఉత్తమ నటుడిగా టైమ్స్ ఫిల్మ్ అవార్డ్ ను కూడా అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ గా SIIMA అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే 2013లో తను నటించిన అత్తారింటికి దారేది మూవీ సంతోషం ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. 2014లో స్టార్ ఇండియా నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని టాప్ ఐదుగురు హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.  
 

click me!

Recommended Stories