ఖరీదైన బైక్ పై ‘హరిహర వీరమల్లు’.. షూటింగ్ గ్యాప్ లో ఇలా.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

First Published Dec 2, 2022, 8:15 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్పాట్ లో సందడి చేశారు. తాజాగా ఖరీదైన బైక్ పై రైడ్ చేశారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆ బైక్ ధర ఎంత హాట్ టాపిక్ గా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల  ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. అటు పవన్ పొలిటికల్ షెడ్యూల్ మూలంగా కాస్తా ఆలస్యం అవుతూ వచ్చింది. 
 

ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ కొనసాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘హరిహర వీరమల్లు’చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. దీంతో మేకర్స్ కూడా సినిమాపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ లో బైక్ రైడ్ తో రచ్చ చేశారు.
 

ఖరీదైన బైక్ పై ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లోకేషన్ లో రైడ్ చేశారు. పవన్ జోష్ గా బైక్ పై వస్తుండటంతో సెట్ లో సందడి నెలకొంది. చిరు నవ్వుతో, స్టైలిష్ లుక్ లో బైక్ రైడ్ చేయడం ఆసక్తికరంగా మారింది. బైక్స్, గన్స్ అంటే పవన్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో లేటెస్ట్ రైడ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట  వైరల్ అవుతున్నారు. 

తాజాగా బైక్ పై వెళ్తున్నప్పుడు పవన్ డిఫరెంట్ క్యాస్టూమ్స్ లోనూ కనిపించారు. ట్రాక్ వేర్ లో, ‘హరిహర వీరమల్లు’ కాస్ట్యూమ్స్ లో రైడ్ చేశారు. ఇప్పటికే ఏపీలోని ఇప్పట్టంలో కారు టాప్ పై కూర్చొని ర్యాలీగా వెళ్లి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి పవన్ బైక్ రైడ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. మరోవైపు పవన్ కళ్యాణ్ నడిపించిన ఆ బైక్ ధర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ (BMW)కు చెందిన BMW R 1250 GS మోడల్ బైక్ పై పవన్ రైడ్ చేశారు. ఈ బైక్ ధర లక్షల్లో ఉంటుంది. హైదరాబాద్ లో దాని ధర ఆన్ రోడ్ ప్రైజ్ గా రూ.24 లక్షలు ఉంది. ఇంత ఖరీదైన బైక్ పై పవన్ రైడ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
 

‘హరిహర వీరమల్లు’ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నటిస్తోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

click me!