పిచ్చి పట్టినట్టు ఉంది ఏం పని చేయాలో అర్థం కావడం లేదు అని అనగా వెంటనే సౌందర్య అంట్లు కడుగు,వంట చేయి, ఇల్లు తుడువు ఒళ్ళు ఉంచి పని చేయడానికి ఉన్నాయి పనులు అని అంటుంది. నేను అలాంటి పనులు చేయను అనడంతో చెప్పింది చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా అని అంటుంది సౌందర్య. అప్పుడు మోనిత నన్ను వదిలేయండి నేను వెళ్లి నా బట్టలు వ్యాపారం చేసుకుంటాను అని అనగా ఆ బట్టల వ్యాపారం వెనుక అసలు ఏముందో తెలుసుకోకుండా నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావే అని అంటుంది సౌందర్య. ఏ గుట్టు లేదు ఆంటీ అంటూ సీరియస్ అవుతుంది మోనిత.