ఇక బాలయ్య రిజెక్ట్ చేసి.. పవన్ కళ్యాణ్ చేసిన మరో సినిమా అన్నవరం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. అయితే నిజమెంతో తెలియదు కాని.. ముందుగా ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్లిందట. అప్పటికే కొన్ని సినిమాల్లో సిస్టర్ సెంటిమెంట్ చేశారు బాలయ్య.. అయితే ఈసిమాను మాత్రంఆయన వద్దు అనుకున్నారట. దాంతో ఈ కథ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళడం.. ఆయన ఒప్పుకోవడం..సినిమా చేయడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అని అనలేం కాని.. మంచి కాన్సెప్ట్ తో జనాదరన పొందింది.