నాని హీరో కాకపోయింటే.. ఏం చేసేవాడతో తెలుసా..? స్వయంగా వెల్లడించిన నేచురల్ స్టార్..

First Published | Aug 20, 2024, 6:02 PM IST

నేచురల్ స్టార్ నాని హీరో అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాడు..? సడెన్ గా హీరో అయిపోయిన నాని.. అసలు లక్ష్యం ఏంటి..? సినిమాల్లోకి రాకముందు ఏం చేద్దాం అనుకున్నాడు..? 

ఎటువంటి సినిమా బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు నేచురల్ స్టార్ నాని. చిన్న స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. దాదాపు 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికిఎదిగాడు నాని.అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. అనుకోకుండా.. అనూహ్యంగా హీరో అయ్యి.. కెరీర్ ను ఒక పద్దతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. హీరో నాని. సహజమైన నటనతో.. నేచురల్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాదించాడు నాని.

All So Read: Jr NTR యమదొంగ సినిమాలో యముడు పాత్ర మోహన్ బాబుది కాదా..? మిస్ అయిన నటుడు ఎవరు..?

టాలీవుడ్ లో స్వతహాగా ఎదిగిన హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. .. లేడీస్ లో క్రేజ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. నానికి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నాని అంటే చాలా ఇష్టం.  నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా. కాలేజ్‌ చదువు పూర్తయ్యాక, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయడం మొదలు పెట్టిన నాని, హైదరాబాద్‌లోనే రేడియో షో హోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తూనే..చిన్న చిన్న పనులు చేసుకున్నారు.

All So Read: రానా వల్లే చదువుకోలేకపోయా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..?


ఇక ఆయనకు అదృష్టం  అష్ట చమ్మా సినిమాతో స్టార్ట్ అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు నాని. ఇక నాని ఇంత పేరు తెచ్చుకున్నాడు కదా..? అసలు నాని హీరో అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాడు..? ముందుగా అతని లక్ష్యం ఏంటో తెలుసా..? ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్బంగా వెల్లడించాడు నాని.  యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న పోలీసులను అగస్ట్ 15 న  నాని కలిశాడు.

All So Read: మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఆ సినిమాల్లో ఈ హీరోలకు టెంపర్ ఎక్కువ...

వారితో కాసేపు ముచ్చ‌టించాడు. ఈ క్రమంలోనే ట్రైనీ కానిస్టేబుల్స్‌ అడిగిన ప్రశ్నలకు నాని తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. ఈక్రమంలోనే నానీని ఒక ట్రైనీ.. ఇలా అడిగాడు.. మీరు హీరో కాకపోయుంటే ఏమి అయ్యేవారు? అని ప్రశ్నించగా.. నాని పోలీస్ అయ్యే వాడినని చెప్పి.. నవ్వేశాడు. ఆ తర్వాత తన మనసులో మాటను చెప్పేశాడు నాని. తాను  హీరో కాకపోతే కచ్చితంగా థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉండేవాడినని ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.  

All So Read:  మహేష్ బాబు సహా.. 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య..

అంతే కాదు నాని మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన నాని.. ఆయన ఫిట్ నెస్ రహస్యం కూడా వెల్లడించాడు. మరో ట్రైనీ.. నాని ఫిట్‌నెస్‌ రహస్యం గురించి అడ‌డ‌గా.. పెద్ద‌గా డైట్స్ ఫాలో అవ్వ‌న‌ని, అమ్మ వండిన అన్ని వంటలు తింటాన‌ని నాని పేర్కొన్నాడు. ఇక నాని మంచి ఊపు మీద ఉన్నాడు.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.  ద‌స‌రా, హాయ్ నాన్న లాంటి సినిమాలతో బ్యాక్  టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి జోష్ లో ఉన్నడు. 

All So Read: 45 నిమిషాల్లో 9 పాటలు ట్యూన్ చేసిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

నాని.. త్వ‌ర‌లో సరిపోదా శనివారం మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్  ఆగ‌స్టు 29న  తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
 

Latest Videos

click me!