Bigg Boss Telugu Season 8: బిగ్ హౌస్లో ఆ ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్... సూపర్ ఫన్!

First Published | Aug 20, 2024, 6:41 PM IST

జబర్దస్త్ షో నుండి ఈసారి ఇద్దరు కమెడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళుతున్నారట. వీరిద్దరి ఎంపిక దాదాపు ఖాయమే అంటున్నారు. ఆ క్రేజీ కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.. 
 

bigg boss telugu season 8 these two jabardasth comedians to contest ksr

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సర్వం సిద్ధం. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు ఖరారైంది. జబర్దస్త్ షో నుండి గతంలో కొందరు కమెడియన్స్ కంటెస్టెంట్స్ చేశారు. ముక్కు అవినాష్ సీజన్ 4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. హౌస్లో అవినాష్ గొప్ప ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన కామెడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. హౌస్లో రాణించిన అవినాష్.. పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. 
 

సీజన్ 6లో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్ పార్టిసిపేట్ చేశారు. ఫైమా, చలాకీ చంటి హౌస్లో అడుగుపెట్టారు. వీరిలో చలాకీ చంటి విఫలమయ్యాడు. రెండు మూడు వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఫైమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 13 వారాలు ఫైమా హౌస్ ఉండటం విశేషం.


Bigg Boss Telugu Season 8


కాగా బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్ట్ చేసే జబర్దస్త్ కమెడియన్స్ వీరే అంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, పవిత్ర, పొట్టి నరేష్,రీతూ చౌదరి బిగ్ బాస్ షోకి వస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. వీరిలో పవిత్ర, పొట్టి నరేష్ ఎంట్రీ దాదాపు ఖాయం అనేది తాజా సమాచారం. 
 

Bigg Boss Telugu Season 8


పొట్టి నరేష్ చాలా కాలంగా జబర్దస్త్ షోలో కొనసాగుతున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం సందడి చేస్తుంటాడు. ఇక పవిత్ర జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో ఒకరు. మరి ప్రచారం అవుతున్నట్లు పవిత్ర, పొట్టి నరేష్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే... నాన్ స్టాప్ ఫన్ గ్యారంటీ అనడంలో సందేహం లేదు. 

రీతూ చౌదరి ఎంట్రీ కూడా దాదాపు కన్ఫర్మ్ అన్నమాట వినిపిస్తుంది. రీతూ చౌదరి తన గ్లామర్ షోతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే అవకాశం ఉంది. అయితే గేమ్ అడినోళ్లే హౌస్లో ఉంటారు. కేవలం గ్లామర్ ని నమ్ముకున్నా ప్రయోజనం ఉండదు. గతంలో పలుమార్లు ఇది రుజువైంది. 
 

కాగా బిగ్ బాస్ సీజన్ 8 వచ్చే నెలలో ప్రారంభం కానుంది. విడుదలైన ప్రోమోలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిట్ లేదని నాగార్జున చెబుతున్నారు. కంటెస్టెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని, సీజన్ 8 గట్టిగా ప్లాన్ చేశారని సమాచారం.. 
 

Latest Videos

click me!