సంచలన చిత్రం `శివ`ని చైనీస్‌ మూవీ నుంచి కాపీ కొట్టానంటూ షాకిచ్చిన వర్మ.. నెట్టింట దుమారం..

Published : Jul 12, 2022, 06:35 PM ISTUpdated : Jul 12, 2022, 08:34 PM IST

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలనాలకు కేరాఫ్. బోల్డ్ స్టేట్‌మెంట్లతో వార్తల్లో నిలిచే ఆయన తాజాగా ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. కాపీ కొట్టి శివ సినిమాని తీసినట్టు వెల్లడించారు.

PREV
19
సంచలన చిత్రం `శివ`ని చైనీస్‌ మూవీ నుంచి కాపీ కొట్టానంటూ షాకిచ్చిన వర్మ.. నెట్టింట దుమారం..

టాలీవుడ్‌లో `శివ`(Shiva Movie) చిత్రం ఒక ట్రెండ్‌ సెట్టర్‌. నాగార్జున (Nagarjuna) కెరీర్‌కి పెద్ద బ్రేక్ నిచ్చిన మూవీ. అదే సమయంలో తెలుగులో `శివ`కి ముందు, `శివ`కి తర్వాత అనేంతగా ఆ సినిమా మలుపుతిప్పింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, టేకింగ్‌ హైలైట్‌గా నిలిచింది. అది తెలుగు సినిమాని కొత్త పుంతలు తొగ్గించింది. డిఫరెంట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, కెమెరా వర్క్, డైలాగులు ఇలా అన్నీ రొటీన్‌కి భిన్నంగా నిలిచాయి. సినిమాని సంచలన విజయాన్ని సాధించాయి. 

29

ఇప్పటికీ `శివ` గురించి చెబితే వర్మ(RGV) గురించి, వర్మ గురించిన ప్రస్తావన వస్తే `శివ` సినిమాని గుర్తు చేసుకుంటారు. అలాంటి ఈ సినిమానే వర్మకి ఒక గుర్తింపు, ఇమేజ్‌ తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభకి నిదర్శంగా చెబుతుంటారు. అలాంటి వర్మ `శివ` సినిమా ఓ విదేశీ చిత్రానికి కాపీ అంటే నమ్మగలరా? అవును.. ఓ చైనీస్‌ మూవీని యదాతథంగా కాపీ కొట్టానని కుండబద్దలు కొట్టి చెప్పారు వర్మ. 

39

`ఎంటర్‌ ది డ్రాగన్‌` (Enter The Dragon) అనే సినిమాని మక్కీకి మక్కీ కాపీ కొట్టానని, చిన్న లొకేషన్‌ మార్చి అదే సినిమాని తెలుగులో తీశానని తెలిపారు వర్మ. ప్రస్తుతం ఆయన రూపొందించిన `లడ్కీ` (Ladki) అనే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు వర్మ. పూజా భలేకర్‌(Pooja Bhalekar) నటించిన ఈ చిత్రం జులై 15న ఇండియా, చైనీస్‌లో విడుదల కాబోతుంది. ఇండో-చైనీస్‌ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రమిది. మార్షల్‌ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో అంతర్లీనంగా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఉంటుందట. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు వర్మ. ఇందులో షాకింగ్‌ విషయం వెల్లడించారు.
 

49

ఫస్ట్ టైమ్‌ ఇండియాలో మార్షల్‌ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయడానికి కారణమేంటని వర్మ(Varma)ని ప్రశ్నించగా, తాను యంగ్‌ గా ఉన్నప్పుడు `ఎంటర్‌ ది డ్రాగన్‌` అనే సినిమాని దాదాపు 20సార్లు చూశారట. ఆ టైమ్‌లో తన వద్ద డబ్బులు లేకపోయినా సైకిల్‌పై వెళ్లి ఆ సినిమా చూశానని తెలిపారు. ఆ సినిమా చూడటం వల్ల బ్రూస్‌లీ ప్రభావం తనపై బలంగా పడిందని, ఆ మార్షల్‌ ఆర్ట్స్ సినిమా తనకు తెగ నచ్చిందని తెలిపారు వర్మ. 
 

59

నిజానికి `శివ` కూడా `ఎంటర్‌ ది డ్రాగన్‌` కాపీ కొట్టి తీసిన సినిమా అని చెప్పారు ఆర్జీవి. `ఎంటర్‌ ది డ్రాగన్‌`లో మార్షల్‌ ఆర్ట్స్ నిపుణుడైన హీరో హాంకాంగ్‌ నుంచి వస్తాడని, ఓ రెస్టారెంట్‌లో ఉంటాడు. అక్కడ కొంత మందితో గొడవ జరుగుతుంది. అందులో హీరో వారికి మార్షల్‌ ఆర్ట్స్ తో చితక్కొడతాడని తెలిపారు. అదే సేమ్‌ స్క్రీన్‌ప్లేని `శివ`లో ఉపయోగించానని, అయితే హోటల్ కి బదులు కాలేజ్‌కి నేపథ్యం మార్చినట్టు పేర్కొన్నారు. ఫైట్స్ లో కూడా మనకు తగ్గట్టుగా మార్పులు చేశానని తెలిపారు. సినిమా మొత్తం `ఎంటర్‌ ది డ్రాగన్‌` తరహాలోనే ఉంటుందని షాకింగ్‌ సీక్రెట్‌ని బయటపెట్టారు వర్మ. 

69

ఇంకా వర్మ చెబుతూ, మార్షల్‌ ఆర్ట్స్ అనేది ఫైట్స్ అని, మన వాళ్లు మార్షల్‌ ఆర్ట్స్ పేరుతో వైర్స్, వీఎఫ్‌ఎక్స్, డూప్స్, ఎడిట్‌లు చేసి మాయ చేస్తారని తెలిపారు. కానీ తాను అలా చేయనని చెప్పారు వర్మ. ``లడ్కీ`లో హీరోయిన్‌ పూజా భలేకర్‌ నిజంగా ఏం చేయగలదో అది చేయించాను. బ్రూస్‌లీ కూడా అంతే.. తాను ఏం చేయగలడో అదే ఫైట్.  సినిమాటిక్‌గా ఉండదు. అందుకే నేను ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అన్నాను. మనవాళ్లు చేసేది స్టంట్స్. మనుషుల్ని మామూలుగా కొట్టడానికి ట్రైనింగ్ తీసుకుని కొట్టడానికి తేడా అదే.

79

`శివ` సినిమా నుంచి నేను అదే ఫాలో అవుతున్నా` అని చెప్పారు ఆర్జీవీ. `శివ` సమయంలో చేసిన ఫైట్స్‌కు రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ ఫైట్స్‌లో నాగార్జున ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను బట్టి నిజంగా కొట్టిన ఫీలింగ్ వచ్చేది. కానీ పూజా ఈ చిత్రంలో మాత్రం రిస్క్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి దూకి, గాల్లోకి ఎగిరి తన్నడం వంటి యాక్షన్స్ ఉంటాయి. ఇక పెద్ద హీరోలు, నిర్మాతలు ఇలాంటి రిస్క్‌లు తీసుకోలేరు.  ఈ అమ్మాయి ఎన్నో ఏళ్ల నుంచి ట్రైనింగ్ తీసుకుంటోంది. అందుకే ఆమెకు తన బాడీ మీద కంట్రోల్ ఉంది` అని అన్నారు వర్మ.

89

`బ్రూస్‌లీ ప్రభావంతో అలాంటి పూర్తి మార్షల్‌ ఆర్ట్స్ సినిమా తీయాలనిపించింది. దాని కోసం ఎంతో మంది ట్రైనర్లను వెతికాను. బ్రూస్‌లీలా ఎవ్వరూ అనిపించలేదు. దొరకరు అని వదిలేశా. పుణెలో పూజా భలెకర్ అని ఓ అమ్మాయి ఉందని తెలిసింది. తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించిందని తెలిసి పిలిపించగా ఆడిషన్స్ ఇచ్చింది. అప్పుడు ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. 

99

ఈ రషెస్ చైనాలోని డిస్ట్రిబ్యూటర్ చూసి ఈ సినిమాను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకే దీన్ని సుమారు అరవై వేల స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. ఇండియా, చైనాలు ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నామని, ఆ తర్వాత ఇతర లాంగ్వేజ్‌లో రిలీజ్‌ చేస్తామన్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories