గురూజీకి అలవాటే, అలాంటి పనులు చేసి సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు.. త్రివిక్రమ్ పై హీరోయిన్ సంచలనం

First Published Jan 6, 2024, 9:13 AM IST

గుంటూరు కారం చిత్రం వివిధ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కుర్చీ మడతపెట్టి, ఓ మై బేబీ సాంగ్స్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. నిర్మాతే రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథపై వివాదం నెలకొంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ లో అలరిస్తున్నాయి. 

అయితే గుంటూరు కారం చిత్రం వివిధ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కుర్చీ మడతపెట్టి, ఓ మై బేబీ సాంగ్స్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. నిర్మాతే రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథపై వివాదం నెలకొంది. గుంటూరు కారం కథలో మెయిన్ పాయింట్ ని త్రివిక్రమ్ కాపీ చేసారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Latest Videos


యద్దనపూడి సులోచన రాణి రచించిన నవల 'కీర్తి కిరీటాలు' లోని మెయిన్ పాయింట్ ని కాపీ చేసి త్రివిక్రమ్ గుంటూరు కారం కథ రాసినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. గతంలో త్రివిక్రమ్ అ..ఆ చిత్రానికి కూడా ఇలాగే చేశారనే ఆరోపణలు వచ్చాయి. అ..ఆ చిత్రంలో యద్దనపూడి సులోచనకి త్రివిక్రమ్ ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అంటూ ట్రోలింగ్ మొదలయింది. 

ఈ క్రమంలో త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ఓ హీరోయిన్చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గురూజీకి ఏదైనా సాధ్యమే అంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ సెటైరికల్ గా రెచ్చిపోయింది. గుంటూరు కారం కథ కాపీ వివాదంపై స్పందిస్తూ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

గురూజీ ఏమైనా చేయగలరు, దాని నుంచి తప్పించుకోవడం కూడా తెలుసు. ఆయన ఎలాంటి తప్పుడు పనులు చేసినా గుడ్డిగా మద్దతు తెలిపే జనాలు ఉన్నారు. అయినా కూడా ఆయనకి గత ప్రభుత్వంలో సీఎం ఆఫీస్ లకి నేరుగా వెళ్లే అనుమతి ఉండేది. సామాన్య ప్రజలకు లేని ఆ అవకాశం ఆయనకి మాత్రమే ఎందుకో అర్థం కాదు. గురూజీ థింగ్స్ అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. 

గతంలో కూడా పూనమ్ కౌర్ పలుమార్లు పరోక్షంగా త్రివిక్రమ్ పై హాట్ కామెంట్స్ చేయడం చూశాం. కథల విషయంలో త్రివిక్రమ్ విమర్శలు ఎదుర్కోవడం ఇది తొలిసారి కాదు. అజ్ఞాతవాసి చిత్రాన్ని కూడా త్రివిక్రమ్ ఫ్రెంచ్ మూవీ నుంచి కాపీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా గుంటూరు కారం చిత్రంపై వస్తున్న విమర్శలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి. 

గుంటూరు కారం చిత్రానికి ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఉపయోగపడుతుందా లేక ప్రమాదంగా మారుతుందో చూడాల్సింది ఉంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. యుఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అవుతోంది. 

click me!