Guppedantha Manasu 6th January Episode:రిషిని చూసిన ఆనందంలో మహేంద్ర, అదిరిపోయిన సీన్..!

First Published Jan 6, 2024, 7:49 AM IST

ఆ శైలేంద్ర ఆటలు రిషి సర్ కోలుకునేంత వరకే అని, రిషి సర్ కి నయం అయిన తర్వాత.. సాక్ష్యాధారాలతో  శైలేంద్రే అసలు నేరస్తుడు అని  నిరూపిస్తారు అని, తగిన శిక్ష వేస్తారు వసు ధీమాగా చెబుతుంది.

Guppedantha Manasu

Guppedantha Manasu 6th January Episode: చాలా కాలంగా రిషి కోసం వసుధార చూసిన ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రిషి ఉన్న చోటు కనిపెట్టడమే కాకుండా.. రిషిని శైలేంద్ర కంట పడనివ్వకుండా క్షేమంగా తన తండ్రి చక్రపాణి ఇంటికి చేర్చింది. అక్కడకు వెళ్లిన తర్వాత రిషికి భోజనం తినిపిస్తుంది వసు. అయితే.. చాలా తక్కువ భోజనం తినడం చూసి చక్రపాణి ఆరా తీస్తాడు. చాలా రోజులుగా గంజినీరు తాగడంతో ఎక్కువ అన్నం తినలేకపోయారు అని వసు చెబుతుంది. తర్వాత ట్రీట్మెంట్ గురించి కూడా అడుగుతాడు. అప్పుడు కూడా వసు పసరు వైద్యం మాత్రమే చేశారు అని చెబుతుంది. కానీ, ఇప్పుడైనా ట్రీట్మెంట్ చేయించాలని, అల్లుడు గారి ముఖం చూస్తేనే బాధగా ఉందని చక్రపాణి అంటాడు. ఒకసారి హాస్పిటల్ కి తీసుకువెళ్లి.. టెస్టులు చేయిస్తే.. అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది కదా అని చక్రపాణి అంటే.. సర్ తో తాను మాట్లాడతాను అని వసు అంటుంది.

Guppedantha Manasu

తర్వాత జగతి మేడమ్ కేసు గురించి ఆరా తీస్తాడు. అలా చేసింది శైలేంద్ర అని వసు చెబుతుంది. చక్రపాణి షాకౌతాడు. అప్పుడు వసు.. ముందు నుంచి తమకు శైలేంద్ర అనే అనుమానం ఉందని, కానీ, ఆ అనుమానమే నిజమైందని వసు చెబుతుంది. శైల్రేందే దోషి అని  అందరికీ తెలిసిపోయిందా? మరి అతనికి శిక్ష పడాలి కదమ్మా అని అడుగుతాడు. అయితే, అతనే దోషి అని ఇంకా తేలలేదు అని చెబుతుంది. కానీ, రిషి సర్ కి శైలేంద్ర మీద అనుమానం మొదలైందని, అది కన్ఫామ్ చేసుకునేలోగా..ఇదంతా జరిగిందని వసు చెబుతుంది. అయినా.. ఆ శైలేంద్ర ఆటలు రిషి సర్ కోలుకునేంత వరకే అని, రిషి సర్ కి నయం అయిన తర్వాత.. సాక్ష్యాధారాలతో  శైలేంద్రే అసలు నేరస్తుడు అని  నిరూపిస్తారు అని, తగిన శిక్ష వేస్తారు వసు ధీమాగా చెబుతుంది.

Latest Videos


Guppedantha Manasu

అల్లుడుగారికి వాళ్ల అమ్మ అంటే చాలా ప్రేమ. వాళ్ల అమ్మగారికి అలా చేసిన వారిని వదిలిపెట్టరు. కచ్చితంగా శిక్ష పడేలా చేస్తారు అని చక్రపాణి కూడా అంటాడు. తర్వాత.. రిషిని కాపాడిన విషయం మహేంద్ర గారికి చెప్పావా అని అడుగుతాడు. ఇంకా చెప్పలేదని వసు అంటుంది. ముందు చెప్పమని , ఆయన చాలా కంగారుపడుతూ ఉంటారని చక్రపాణి అంటాడు. దానికి వసు సరే అంటుంది.

Guppedantha Manasu

మరోవైపు మహేంద్ర, అనుపమ ఇంట్లో కూర్చొని.. వసు ఇంకా రాలేదని బాధపడుతూ ఉంటారు.  మనకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మహేంద్ర అంటాడు. తాను ప్రాణంగా ప్రేమించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, కానీ, పెళ్లైన కొంతకాలానికే జగతి, నేను విడిపోవాల్సి వచ్చిందని.. గతంలో జరిగినవన్నీ అనుపమతో పంచుకుంటాడు.  రిషి కనపడట్లేదు, వసు కనపడట్లేదు అని ఆ బాధ తట్టుకోవడం తన వల్ల కావడం లేదని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu

అనుపమ.. మహేంద్రకు ధైర్యం చెబుతుంది. వసుధార.. రిషి కోసం  వెళ్లి ఉంటుదని, రిషి, వసుల ప్రేమ చాలా గొప్పదని వాళ్లను ఆ ప్రేమే ఒకటి చేస్తుంది అని అనుపమ అంటుంది. వీళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగగగా, మహేంద్రకు వసుధార నుంచి ఫోన్ వస్తుంది. ‘ వసుధార ఎక్కడ ఉన్నావమ్మా? నీకోసం చాలా వెతికానమ్మా? ఎక్కడికి వెళ్లిపోయావ్..?’ అంటూ చాలా ప్రశ్నలు వేస్తాడు.

వెంటనే అటు నుంచి డాడ్ అంటూ రిషి గొంతు వినపడుతుంది. మహేంద్ర షాక్ అవుతాడు. ఆనందంలో వాళ్లకు మాటలు రావు.  తర్వాత తేరుకొని రిషీ అని పిలుస్తాడు. ‘నేను నీ రిషినే డాడ్’అని రిషి అంటాడు. రిషి క్షేమంగా బయటపడినందుకు మహేంద్ర సంతోషిస్తాడు. వసుధార కూడా తన పక్కనే ఉందని రిషి చెప్పడంతో.. మహేంద్రకు ఆనందంతో కన్నీళ్లు ఆగవు. తర్వాత తాను బాగానే ఉన్నాను అని రిషి చెబుతాడు. అయితే.. నిన్ను చూడాలని ఉందని మహేంద్ర అడుగుతాడు. నీ కోసం చాలా వెతికామని.. అలా జరిగిన విషయాలన్నీ చెబుతాడు.

Guppedantha Manasu

తర్వాత అనుపమ కూడా రిషితో మాట్లాడుతుంది. బాగున్నావా రిషి అని అడుగుతుంది. మా బెంగంతా నీమీదే, నువ్వు బాగుంటే చాలు అని తర్వాత మళ్లీ మహేంద్రకు ఇస్తుంది. తర్వాత మహేంద్ర ఎక్కడ ఉన్నావ్ అని అడిగితే.. చక్రపాణి ఇంట్లో ఉన్నాననే విషయం చెబుతాడు. అక్కడికి  బయలుదేరతాం అని మహేంద్ర అంటాడు. అక్కడ సీన్ కట్ చేస్తే.. క్యాబ్ లో  మహేంద్ర చక్రపాణి ఇంటికి చేరుకుంటాడు.

Guppedantha Manasu

రిషి అని పిలుచుకుంటూ లోపలికి పరిగెత్తుతాడు. రిషిని చూసి ప్రేమగా హత్తుకొని, ముద్దులు పెట్టుకుంటాడు. ఎలా ఉన్నావ్ నాన్న అని అడుగుతాడు. తాను బాగున్నానని, మీరు ఎలా ఉన్నారు డాడ్ అని రిషి అడిగితే.. అస్సలు బాలేదని.. నీ మీద బెంగతో సరైన తండి, నిద్ర లేదని.. ఆరోగ్యం పాడైందని చెబుతాడు. తర్వాత ఇద్దరూ యోగక్షేమాలు మాట్లాడుకుంటారు. అనుపమని కూడా రిషి బాగున్నారా అని అడుగుతాడు.

Guppedantha Manasu

తర్వాత వసు... రిషి కండిషన్ గురించి చెబుతుంది. నిలపడలేకపోతున్నాడని, ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నారని చెబుతుంది. రౌడీలు ఎటాక్ ఛేస్తే.. వృద్ధ దంపతులు కాపాడారని మొత్తం విషయం చెబుతుంది. అయితే... అనుపమ.. సరైన ట్రీట్మెంట్ చేయించాలని అంటుంది. అసలు.. రిషిని నువ్వు ఎలా కలిశావ్ అని  వసుధారను మహేంద్ర అడిగితే... జరిగిన మొత్తం చెబుతుంది. తనకు ఎందుకు చెప్పలేదని మహేంద్ర అడిగితే.. ఆ సమయంలో తాను ఒక్కదాన్ని వెళ్లడమే కరెక్ట్ అనిపించిందని చెబుతుంది. రౌడీలు వెంటపడటం, తనను కిడ్నాప్ చేయడం, ముకుల్ కాపాడటం కూడా మొత్తం వివరిస్తుంది.

Guppedantha Manasu

సర్ నుంచి ఫోన్ రాగానే తాను రిషి సర్ గురించి తప్ప ఇంకేం ఆలోచించలేదు అంటుంది. తనకు ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా ఆలోచించలేదు అని చెబుతుంది. అయితే... రిషిని మన ఇంటికి తీసుకొని వెళదాం అని మహేంద్ర అంటాడు. కానీ... అక్కడ కంటే.. ఇక్కడే సేఫ్ గా ఉంటారు అని , చాలా ఎటాక్స్ జరిగే ప్రమాదం ఉందని వసు అంటుంది. వాళ్లు ఎటాక్ చేస్తుంటే..నేను చూస్తూ ఊరుకుంటానా.. కాల్చేస్తాను అని మహేంద్ర ఆవేశపడతాడు. కానీ.. అనుపమ కూల్ చేస్తుంది. ఈ సమయంలో ఆవేశంగా కాకుండా, ఆలోచించి అడుగు వేయాలని సర్ది చెబుతుంది. వసుధార చెప్పినట్లు.. రిషి అక్కడ కంటే... ఇక్కడే సేఫ్ గా ఉంటాడు అని అనుపమ అంటుంది. మహేంద్ర తప్పక ఒకే చెబుతాడు.

తర్వాత రాత్రిపూట రిషికి వసు పాలు, బ్రెడ్ తీసుకువస్తుంది. తనకు ఏదో ఇబ్బందిగా ఉందని రిషి అంటే... అది ఇబ్బంది కాదని, ఆకలి అని చెప్పి.. తినిపిస్తుంది. అయితే. .. రిషి.. వసుని కూడా తినమని చెబుతాడు. తర్వాత తింటాను అంటుంది. మహేంద్ర కూడా  రిషి కోసం యాపిల్స్ తీసుకొని వస్తాడు. ఇద్దరూ కలిసి తినండి అని చెప్పి వసుకి ఇస్తాడు. తర్వాత వసుని ప్రేమగా తలపై నిమిరి.. అనుకున్నది సాధించావ్ అని, నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకున్నావ్ అని మెచ్చుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!