ఈ క్రమంలో వినాయక్ గురించి ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. ఆ రూమర్ కి బలాన్ని చేకూర్చేలా నెటిజన్లు ఈ వార్తని వైరల్ చేస్తున్నారు. అదేంటంటే వినాయక్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారట. వినాయక్ బంధువులు, సన్నిహితులు కొందరు వైసీపీలో ఆల్రెడీ ఉండడంతో ఈ రూమర్ కి బలం చేకూరింది.