సొంత ఇంటికోసం పక్కింటిని కూల్చేసింది.. పూనమ్‌ కౌర్‌ పోస్ట్ దుమారం.. సమంతనేనా?

Published : Dec 01, 2025, 06:32 PM IST

సమంత, రాజ్‌ నిడిమోరు ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా కలిసి తిరిగిన ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు నటి పూనమ్‌ కౌర్‌ పెట్టిన పోస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. 

PREV
15
ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా సమంత, రాజ్‌ నిడిమోరు పెళ్లి

హీరోయిన్‌ సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు పెళ్లి వార్త ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సమంత, రాజ్‌ ఈ సోమవారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో  సమంత, రాజ్‌ లకు సెలబ్రిటీలు, అభిమానులు విషెస్‌ తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడంతా సమంత పెళ్లి విషయమే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

25
సమంత పెళ్లిపై పూనమ్‌ కౌర్‌ పోస్ట్

ఈ క్రమంలో తాజాగా మరో నటి పూనమ్‌ కౌర్‌ పోస్ట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఆమె ట్విట్టర్‌ ద్వారా పెట్టిన పోస్ట్ రచ్చ చేస్తోంది.  సమంతని ఉద్దేశించే ఈ కామెంట్‌ చేసిందని అంటున్నారు. మరి ఇంతకి పూనమ్‌ కౌర్‌ ఏం పెట్టిందంటే. `సొంత ఇంటిని నిర్మించుకోవడానికి మరికరి ఇళ్లుని కూల్చేయడం అత్యంత బాధాకరం. బలహీనమైన, నిస్సహాయ పురుషులను డబ్బుతో కొనవచ్చు, ఈ అహంకారపూరిత మహిళను పెయి‌డ్‌ పీఆర్‌ గొప్పవారిగా చూపిస్తున్నారు` అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.

35
పూనమ్‌ కౌర్‌ పెట్టిన పోస్ట్ ఇదే

ఇప్పుడి నెట్టింట రచ్చ చేస్తోంది. పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పూనమ్‌ కౌర్‌ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు సమంత రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమెని ఉద్దేశించే పూనమ్‌ ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాగా చెప్పావని పూనమ్‌ కి సపోర్ట్ గా కొందరు రిప్లై ఇస్తుంటే, ఆమె జీవితం నీకెందుకంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇది నెట్టింట పెద్ద రచ్చ రచ్చ అవుతుంది.

45
సెలబ్రిటీలు టార్గెట్‌గా పూనమ్‌ పోస్ట్ లు

పూనమ్‌ కౌర్‌ సెలబ్రిటీలపై ఇలాంటి కామెంట్లు చేయడం కామనే. ఆమె అప్పుడప్పుడు ఇలా బోల్డ్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తోంది. టైమ్‌ వచ్చినప్పుడల్లా దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి, అలాగే పవన్‌ కల్యాణ్‌ గురించి పరోక్షంగా విమర్శలు చేస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు సమంతని టార్గెట్ చేసిందంటున్నారు.

55
తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన రాజ్‌ నిడిమోరు

ఇదిలా ఉంటే రాజ్‌ నిడిమోరుకి కూడా ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఆయన శ్యామలిదే ని వివాహం చేసుకున్నారు.  ఆ తర్వాత ఇటీవలే విడిపోయారు. అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నట్టు సమాచారం. సమంత, రాజ్‌ నిడిమోరు కలిసి తిరుగుతున్నారనే విషయాన్ని శ్యామలిదే తరచూ పోస్ట్ లతో కామెంట్లు చేస్తుంటుంది. తాజాగా ఈ రోజు పెళ్లి సందర్భంగా కూడా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారని ఆమె పెట్టిన పోస్ట్ కూడా పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు పూనమ్‌ పోస్ట్ సైతం వివాదంగా మారడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories