అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది.