మరో కామెడీ ఫిల్మ్ కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్, డైరక్టర్ ఎవరంటే...

First Published | Nov 20, 2024, 2:27 PM IST

విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత, వెంకటేష్ డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణతో ఒక కొత్త చిత్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ అని భావిస్తున్నారు.

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


వెంకటేష్ ఈ మధ్యన కాస్త స్పీడు తగ్గించారు. ఆచి,తూచి స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ట‌రీ వెంక‌టేష్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎఫ్‌-2, ఎఫ్‌-3 సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దీంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది. ఈ నేఫధ్యంలో వెంకటేష్ తన తదుపరి చిత్రం ఫైనల్ చేసారని తెలిసింది.

Venkatesh Daggubati

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌   తో  నిర్మాతలకు సుఖం ఏమిటంటే... చాలా  ఫాస్ట్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే కొత్త సినిమాలను మొదలుపెడుతుంటాడు. చిన్న దర్శకుడు స్టార్ దర్శకుడు అనే తేడాలు లేకుండా వరుసగా సినిమాలు చేయటమే ఈయన ప్రత్యేకత.

ఇక తెలుగు లో మల్టీస్టారర్ సినిమాలకు వెంకీ పెట్టింది పేరు. యంగ్ హీరోలకు పోటీగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు వెంకటేష్. అయితే ఆయన సినిమాల్లో ఎక్కువ కామెడీగా ప్రయారిటి ఇస్తున్నారు. ఫ్యామిలీలు మొత్తం కలిసి చూసే సినిమా కథలే ఎంచుకుంటున్నారు ఆయన. 
 


Daggubati Venkatesh

ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్ ప్రముఖ సిరీస్ రానా నాయుడు రెండవ సీజన్ షూటింగ్ ని రీసెంట్ గా పూర్తి చేసారు . త్వరలో నెట్ ప్లిక్స్ లో ఆ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.  ఇప్పటికే  స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సెట్స్ నుండి  బిహైండ్ స్క్రీన్ వీడియోను షేర్ చేయడం ద్వారా స్నీక్ పీక్ ఇచ్చింది.

క్లిప్‌లో, రానా దగ్గుబాటి, వెంకటేష్, అర్జున్‌తో సహా సిరీస్‌లోని ప్రధాన తారలు గ్రిప్పింగ్ అవతార్‌లలో చూడవచ్చు. ''రానా నాయుడు సీజన్ 2 ఇప్పుడు చిత్రీకరిస్తోంది'' అని నెట్‌ఫ్లిక్స్ వీడియోతో పాటు రాసింది. ఈ క్రమంలో వెంకటేష్ తన నెక్ట్స్ సినిమాను సైన్ చేసారు.


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డీజే టిల్లు దర్శకుడు  విమ‌ల్ కృష్ణ క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం అందుతోంది. ‘డీజే టిల్లు’ సినిమా సూప‌ర్ హిట్ అయ్యినా ఆయన తదుపరి చిత్రం వెంటనే చేయలేదు. అలాగే  ‘డీజే టిల్లు 2’కి  ఆయ‌న దూరంగా ఉన్నారు.   ఓ క‌థ రెడీ చేసుకొని హీరోల ఒప్పించే పనిలో ఉన్నారు.

ఆ క్రమంలోనే చివ‌రికి వెంకీ ఈ క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ‘టిల్లు’లా ఇది కూడా ఓ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది. 2025 ప్రారంభంలో మొద‌లెట్టి...అదే ఏడాది చివ‌ర్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. చిట్టూరి శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశం ఉంది. న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.


మరో ప్రక్క వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అవి కార్యరూపం మాత్రం దాల్చటం లేదు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ‘మల్లీశ్వరి’ సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు.

ఈ రెండు సినిమాలు భారీవిజయాలను అంతే కాదు వెంకీ కెరియర్లో మైలు రాళ్లుగా మిగిలాయి. ఇక ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ వెంకటేష్ ను డైరెక్ట్ చేయబోయే అవకాసం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేసే గ్యాప్ లో వెంకీ తో సినిమా పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉందిట.   

Latest Videos

click me!