ఎన్టీఆర్ భారీ ప్రాజెక్టు: సీన్ లోకి ‘సితార’బ్యానర్, డైరక్టర్ ఎవరంటే..

First Published | Nov 20, 2024, 2:34 PM IST

 ఎన్టీఆర్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన షాకింగ్‌ అప్‌ డేట్ బయటకు వచ్చింది. సితార బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ మూవీ  గూస్‌ బంమ్స్ తెప్పించే విధంగా ఈ మూవీ ఉండబోతుందట. 

devara, collections, NTR, naga vamsi

మేన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్  ఎన్టీఆర్ రీసెంట్ గా  ‘దేవర’తో గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే వరస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీ సినిమా ‘వార్ -2’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

మరో ప్రక్క ఈ సినిమా తర్వాత జనవరి నుంచి  ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని సితార బ్యానర్ నిర్మించనుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ గా స్టార్ట్ అయిన  సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. తెలుగులో లీడ్ బ్యానర్ గా, మెయిన్ బ్యానర్ గా ఎదిగింది. ఏడాదికి మినిమం నాలుగైదు సినిమాలు ప్లాన్ చేసి తెస్తున్నారు  ఆ బ్యానర్ నుంచి. అంతే కాదు పవన్ కళ్యాణ్, బాలయ్య, విజయ్ దేవరకొండ, రవితేజ ల సినిమాలు వరసగా రాబోతున్నాయి. ఇప్పుడు మరో  పాన్ ఇండియా సినిమా కి రంగం సిద్దం చేసారు. 


NTR

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్క్రిప్ట్ ను సిద్థం చేయమని చెప్పారని తెలుస్తోంది.  ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్, హోంబలే ఫిలిమ్స్ పోటీ పడగా… చివరకు ఎన్టీయార్ సితార సంస్థ వైపే మొగ్గు చూపాడని  అంటున్నారు.

అన్ని అనుకున్నట్టు జరిగితే… సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ బ్యానర్ లో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ తర్వాత చేసే సినిమా ఇదే అవుతుంది అంచనా.
 

Junior NTR starrer Devara collection report out


ఇక వార్ 2, ప్రశాంత్ నీల్, సినిమాల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా నీల్సన్ దే  అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల పని మీద వున్నారు. వాటిలో ఒకటి పూర్తి కాగానే నీల్సన్ సినిమా ప్రారంభించనున్నారు.

ఎన్టీఆర్- నీల్సన్ అంటే చాలా భారీగా ఉండబోతోందని, ఫన్,యాక్షన్ కలగలిపిన  పాన్ ఇండియా సినిమా అవుతుంది అని చెప్తున్నారు.  సితార సంస్థకు ఈ సినిమా తమిళ ఎంట్రీ అవుతుందని చెప్తున్నారు. 

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మొదటి సారి జంటగా నటించిన సినిమా దేవర. జనతా గ్యారెజ్ మూవీ తర్వాత కొరటాల శివ-తారక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో మంచి జోరు చూపించింది. ఇప్పుడు ఓటిటీలోనూ దుమ్ము రేపుతోంది. 

read more: ఖాళీగా ఉందని అమ్మాయిని ప్రేమించిన చిరంజీవి డైరెక్టర్‌, ఇన్‌ కమింగ్‌ కాల్‌ ఫ్రీ చేయాలంటూ దేవుడికి మొక్కులు

also read: `పుష్ప 2`కి ఫహద్‌ ఫాజిల్‌ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే? హీరోయిన్‌ కంటే కూడా

Latest Videos

click me!