Pooja Hegde: సూర్య 'రెట్రో' కోసం మొదటిసారి ఆ పని చేయబోతున్న పూజా హెగ్డే.. థియేటర్లో సర్‌ప్రైజ్‌

Published : Mar 12, 2025, 06:16 PM IST

Pooja Hegde: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న `రెట్రో` సినిమా కోసం పూజా హెగ్డే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకి ఆమె ఏం చేయబోతుందో తెలుసా?

PREV
14
Pooja Hegde: సూర్య 'రెట్రో' కోసం  మొదటిసారి ఆ పని చేయబోతున్న పూజా హెగ్డే.. థియేటర్లో సర్‌ప్రైజ్‌
Retro, Pooja Hegde

Pooja Hegde: `కంగువా` సినిమా తర్వాత సూర్య నటిస్తున్న మూవీ `రెట్రో`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. 

24
రెట్రో సూర్య

శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా. జాకీ, మాయపాండి ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా మేడే స్పెషల్‌గా మే 1న విడుదల కానుంది. ఈ సినిమా కోసం పూజా హెగ్డే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్‌లో మొదటిసారి ఆ పని చేయబోతుంది పూజా. 

34
రెట్రో మూవీ కోసం డబ్బింగ్ చెప్పిన పూజా హెగ్డే

`రెట్రో` సినిమా కోసం పూజా హెగ్డే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ఆమె తమిళంలో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. ఆమె ప్రయత్నానికి ప్రశంసలు వస్తున్నాయి.

44
పూజా హెగ్డే రాబోయే సినిమాలు

`రెట్రో` తర్వాత పూజా హెగ్డేకు తమిళంలో మూడు సినిమాలు ఉన్నాయి. `కూలీ` సినిమాలో ఒక పాటలో స్టెప్పులేసింది. విజయ్ సరసన `జననాయగన్` సినిమాలో నటిస్తోంది. ఇలా మళ్లీ కెరీర్‌ పరంగా స్పీడ్‌ పెంచింది పూజా. కానీ తెలుగులో ఇంకా మరే మూవీకి ఒప్పుకోలేదు. 

read  more: Bigg Boss Telugu 9 Host: విజయ్‌ దేవరకొండ బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే

also read: Soundarya-Uday kiran: సౌందర్య, ఉదయ్‌ కిరణ్‌ కలిసి నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? కానీ అది కూడా విషాదమే

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories