తమిళ అభిమానుల్లో కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో ఇంతవరకు 1000 కోట్ల చిత్రం రాలేదు. కూలీ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. రజనీకాంత్, నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర లాంటి స్టార్ పవర్ ఈ చిత్రంలో ఎలాగూ ఉంది. కాబట్టి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ చేస్తే 1000 కోట్లు సాధించడం అంత కష్టం కాకపోవచ్చు.