ఇంతలో వరస్ట్ పర్ ఫెర్మెర్‌ని ఎంచుకొని దోషిగా నిలబెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ఒక్కోక్కరు బోనులో తలపెట్టించి వారు చేసిన తప్పులను చెప్పి ముఖంపై నీళ్లు కొట్టాల్సి ఉంటుంది. ఇందులో చాలా వరకు కాజల్ పేరుని దోషిగా తేల్చారు. స్వేత, హమీద, శ్రీరామ్, అనీ మాస్టర్, లోబో, రవి, విశ్వ ఇలా ఏడుగురు కాజల్‌ని దోషిగా తేల్చారు. అయితే అనీ మాస్టర్ మాత్రం తీవ్రంగా మండిపడింది. ఆమె ఫేక్‌గా ఆడుతుందని, ఆమెతో కలవాలని కోరుకుంటున్నప్పటికీ తన నుంచి పాజిటివ్ వైబ్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాజల్‌పై ఉన్న కోపం ఇది అంటూ మూడు గ్లాసుల నీళ్లని తన ముఖంపైనే కొట్టుకుంది అనీ మాస్టర్.