సునామీకి ముందు చిరు జల్లులు.. తడితడి అందాలతో కిర్రాక్‌ పుట్టిస్తున్న పూజా హెగ్డే

Published : Oct 08, 2021, 05:47 PM IST

పూజా హెగ్డే.. నో డౌట్‌ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌. స్టార్‌ హీరోలకు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. నటన, అందం మేళవించిన ఈ డస్కీ అందాల భామ తాజాగా తన తడి తడి అందాలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. 

PREV
16
సునామీకి ముందు చిరు జల్లులు.. తడితడి అందాలతో కిర్రాక్‌ పుట్టిస్తున్న పూజా హెగ్డే

పూజా హెగ్డే లేటెస్ట్ గా తన గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంది. ఇంగ్లీష్‌ యువరాణి మాదిరి, యుద్ధ యోధురాలు మాదిరిగా డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. తడిసిన అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది పూజా హెగ్డే. ఎప్పుడూ కనిపించని విధంగా కొత్తలుక్‌లో కనువిందు చేస్తుందీ బుట్టబొమ్మ. 
 

26

సునామికి ముందు చిరు జల్లులు మాదిరిగా ఉంది పూజా లేటెస్ట్ లుక్స్. ఎందుకుంటే సాయంత్రం ఈ భామ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో కనువిందు చేయబోతుంది. ఇందులో భాగంగా పూజా మరింత ఘాటుగా రెచ్చిపోనుంది. దీంతో అసలైన అందాలు చూసే ముందు ఇదొక చిన్న ట్రీట్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేయడం విశేషం. 
 

36

పూజా హెగ్గే గతంలో నాగచైతన్యతో `ఒక లైలా కోసం` చిత్రంలో నటించారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత తమ్ముడు అఖిల్‌ అక్కినేనితో జోడి కట్టింది పూజా. ఈ సినిమా ఈ నెల 15న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ అయ్యాయి. 
 

46

అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్‌సీలో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ప్రీ రిలీజ్‌ ఈవేంట్‌ జరుగుతుంది. దీనికి నాగచైతన్య గెస్ట్ గా వస్తుండటం విశేషం. ఇందులోపూజా ఎంత స్టయిలీష్‌గా, అందంగా కనిపిస్తుందో అని ఆమె అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

 

56

పూజా హెగ్డే.. బన్నీతో నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది పూజా. ఈ సినిమా సంచలన విజయం సాధించడం, ఇందులో అల్లు అర్జున్‌.. పూజా కాళ్లని హైలైట్‌ చేయడం ఈ హాట్‌ హీరోయిన్‌కి క్రేజ్‌ని తీసుకొచ్చింది.

 

66

ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది పూజా. తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`లో నటిస్తుంది. అలాగే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. మరో తమిళ సినిమా కూడా చేస్తుందని టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories