గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' మూవీ రివ్యూ

First Published Oct 8, 2021, 4:23 PM IST

గోపీచంద్, నయనతార జంటగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ చిత్రం నాలుగేళ్లుగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రానికి మోక్షం లభించింది. 

గోపీచంద్, నయనతార జంటగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ చిత్రం నాలుగేళ్లుగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రానికి మోక్షం లభించింది. నేడు ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలయింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథ : ఎలాంటి లక్ష్యం లేకుండా లైఫ్ ని సరదాగా గడిపే యువకుడు శివ (గోపీచంద్). గోపీచంద్ కు  తన కుటుంబం అంటే ఎంతో ఇష్టం. కానీ గోపీచంద్ తండ్రి ప్రకాష్ రాజ్ కు మాత్రం కొడుకు మీద ఇష్టం ఉండదు. ఎలాంటి భాద్యత లేకుండా తిరుగుతున్నాడనే కోపం ఉంటుంది. ఈ క్రమంలో గోపీచంద్ నయనతార ప్రేమలో పడతాడు. అంతా బాగానే జరుగుతోంది అనుకుంటున్నా తరుణంలో గోపీచంద్ కుటుంబానికి విలన్ అభిమన్యు సింగ్  వస్తుంది. అభిమన్యు సింగ్ ప్రకాష్ రాజ్ పొలాన్ని ఆక్రమిస్తాడు. గోపీచంద్ తన ఆస్తిని ఎలా దక్కించుకున్నాడు ? తండ్రి మనసు ఎలా దోచుకున్నాడు ? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ : ఆరడుగుల బుల్లెట్ కథ గోపీచంద్ కు బాగా సూట్ అయింది. గోపీచంద్ ని దర్శకుడు బి గోపాల్ ప్రజెంట్ చేసిన విధానం బావుంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని అంశాలతో ఫస్ట్ హాఫ్ చక్కగా కుదిరింది. ఈ చిత్రంలో గోపీచంద్ కామెడీ టైమింగ్ బావుంటుంది. నయనతార, గోపిచంద్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక నయనతారని అందంగా చూపించడం లో సక్సెస్ అయ్యారు. నయనతార లాంటి హీరోయిన్ అందంగా కనిపిస్తే యూత్ ఆడియన్స్ లో సినిమాకి పాజిటివిటి పెరుగుతుంది. గోపీచంద్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే ఎపిసోడ్స్ ని దర్శకుడు బాగా హ్యడిల్ చేశారు. ఈ విలన్ పాత్ర ఈ చిత్రంలో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. విలన్ రోల్ చాలా వీక్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లోనే కథ మొత్తం తెలిసిపోవడంతో సెకండ్ హాఫ్ లో ఆసక్తికరంగా ఏమీ ఉండదు. తండ్రి కొడుకుపై కోపంగా ఉండడం లాంటి సన్నివేశాలు గతంలో చాలా సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. కథ కూడా చాలా కమర్షియల్ చిత్రాల్లో చూసినదే. కాబట్టి రొటీన్ గా అనిపిస్తుంది. 

నటీనటులు :ముందుగా చెప్పినట్లుగా ఈ చిత్రం గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి గోపీచంద్ చాలా ఈజీగా ఈ రోల్ పోషించాడు. నయనతారతో అతడి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. పోరాట సన్నివేశాల్లో గోపీచంద్ చాలా బాగా చేశాడు. గోపీచంద్ ని స్టైలిష్ గా చూపించడం లో బి గోపాల్ సక్సెస్ అయ్యారు. ఇక ప్రకాష్ రాజ్ లోని ఎమోషనల్ యాంగిల్ ని ఈ చిత్రంలో చూడొచ్చు. అలాగే దివంగత నటులు ఎం ఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి కూడా ఈ చిత్రంలో ఉన్నారు. బ్రహ్మానందంతో వారి కామెడీ బావుంటుంది. సినిమా బోర్ కొట్టకుండా తమ హాస్యంతో మెప్పించే ప్రయత్నం చేశారు. 

సాంకేతికంగా : ఈ చిత్రంలో నిర్మాణవిలువలు బావున్నాయి.  కెమెరామెన్ పనితనం బావుంది. మంచి విజువల్స్ రాబట్టారు. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కనల్ కణ్ణన్ యాక్షన్ ఎపిసోడ్స్. ప్రతి ఫైట్ సన్నివేశం మంచి అటెన్షన్ తీసుకుంటుంది. మణిశర్మ సంగీతం బావుంది.ప్రతి సాంగ్ స్క్రీన్ పై ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

చివరగా :కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ చిత్రం ఎట్టకేలకు విడుదలై మమ అనిపించుకుంది. ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్.. పోరాట సన్నివేశాలు, నయనతార గ్లామర్ పాజిటివ్ అంశాలు అయితే.. రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ లో కేవలం ఎమోషన్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కథని గాలికి వదిలేయడం లాంటివి బిగ్ మైనస్ లు.   

రేటింగ్ : 2.25/5

click me!