`రెట్రో` సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ అండమాన్, చెన్నై, ఊటీ వంటి ప్రాంతాల్లో జరిగింది. ప్రేమ, యాక్షన్ కలగలిసిన కథాంశంతో రూపొందిన ఈ సినిమా మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.
ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. `కంగువా` పరాజయంతో నిరాశలో ఉన్న సూర్యకి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.