Pooja hegde:పూజా హెగ్డేను పక్కన పెట్టేస్తున్న నిర్మాతలు.. ఈ భామను భరించడం కష్టమంటూ...

First Published Jan 29, 2022, 1:46 PM IST


లక్కీ హీరోయిన్ హోదా తెచ్చుకున్న పూజా హెగ్డే (Pooja hegde)రెమ్యూనరేషన్ ఓ రేంజ్ లో పెంచేశారు. స్టార్ హీరోలు వెంబడి పడుతుండడంతో ఆకాశంలో చూస్తుంది. అటూ ఇటుగా టూ టైర్ హీరోల కి సమానంగా ఛార్జ్ చేస్తున్న పూజా దెబ్బకు నిర్మాతలు హడల్ పోతున్నారట. 

అయితే అదే ఆమెకు మైనస్ కూడా అయ్యిందంటున్నారు. మీడియం రేంజ్ నిర్మాతలు పూజాను పక్కన పెట్టేశారట. ఆమెను చెల్లించడం మన వల్ల కాదని వేరే ఆప్షన్స్ వెతుక్కుంటున్నారట.  ఇది పూజా కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పూజ హెగ్డే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ మొత్తం దాదాపు పూర్తి అయ్యాయి. రాధే శ్యామ్(Radhe shyam), బీస్ట్ చిత్రాల షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పూజా ఖాళీగా ఉన్నారు. ఆమె చేతిలో మహేష్ మూవీ మినహా కొత్త చిత్రాలేవీ లేవు. హిందీ ప్రాజెక్ట్స్ మినహాయిస్తే తెలుగులో కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు.

Pooja Hegde

ప్రస్తుతం ఆమెకు ఉన్న డిమాండ్ రీత్యా చాలా చిత్రాలు ఒప్పుకోవాల్సింది. కానీ అలా జరగడం లేదు. పూజా తెలుగులో నటించిన చిత్రాలన్నీ హిట్ కొట్టాయి. దర్శక నిర్మాతలు ఎమ్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఆమె రెమ్యూనరేషన్ మాత్రం వాళ్లకు అందుబాటులో లేదు. అమ్మడుకి ఆఫర్ ఇవ్వాలని మనసులో ఉన్నా ఖర్చు చూసి వెనక్కి పోతున్నారు.

pooja hegde


ఇక స్టార్ హీరోయిన్ హోదా వచ్చాక అమ్మడు ప్రవర్తన కూడా మారిపోయిందట. సెట్స్ కి లేటుగా రావడం, అనవసరంగా పెద్ద టీమ్ ని మైంటైన్ చేస్తూ... నిర్మాతలకు తలనొప్పిగా మారారట. రాధే శ్యామ్ విషయంలో పూజా హెగ్డే-ప్రభాస్(Prabhas) మధ్య మనస్పర్థలు తలెత్తాయన్న కథనాలు వెలువడ్డాయి. 

ఆ మధ్య తమిళ దర్శక నిర్మాత ఆర్ కె సెల్వమణి పూజా పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూజా హెగ్డే 12 మంది వ్యక్తిగత సిబ్బందిని మైంటైన్ చేస్తూ, వాళ్ళ ఖర్చులు నిర్మాతలపై వేస్తూ భారంగా తయారయ్యారంటూ ఓపెన్ గా ఫైర్ అయ్యారు. ఇవన్నీ గమనిస్తుంటే స్టార్ హీరోయిన్ హోదా దక్కడంతో పూజా యాటిట్యూడ్ పెరిగిపోయిందన్న మాట వినిపిస్తుంది.

pooja hegde

ఓ స్థాయిలో ఉన్నప్పుడు ఒద్దికగా ఉంటే లాంగ్ కెరీర్ దక్కుతుంది. అలా కాకుండా ఇలా టెక్కు చూపిస్తే తెరమరుగు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా పూజా హెగ్డే ఈ విషయం గమనించి... రెమ్యూనరేషన్ కొంచెం అందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుంది.

click me!