రజనీకాంత్ హీరోగా రూపొందిన `కూలీ` సినిమాలోని పూజా హెగ్డే నటించిన `మోనికా` పాట విడుదలై దుమ్మురేపుతుంది. అయితే ఈ పాటలో నటించేందుకు పూజా ఎంత పారితోషికం తీసుకుందో చూద్దాం.
పూజా హెగ్డే ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తుంది. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్ అవుతుంది.
తెలుగు ఆడియెన్స్ ముద్దుగా బుట్టబొమ్మగా పిలుచుకునే పూజా `కూలీ` సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
25
ట్రెండింగ్‌లో పూజా హెగ్డే `మోనికా` సాంగ్
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.
వరుసగా మెయిన్ కాస్టింగ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్‌లు విడుదల చేసింది. ఇప్పుడు పాటలను విడుదల చేస్తుంది. అందులో భాగంగా `కూలీ` సినిమా నుంచి `మోనికా` అనే సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు.
ఇందులో పూజా హెగ్డే స్పెషల్‌గా స్టెప్పులేసింది. పోర్ట్ ఏరియాలో, గ్రూప్ డాన్స్ గా సాగే ఈ పాట ఆద్యంతం కట్టిపడేస్తుంది. మాస్ ఆడియెన్స్ ని ఉర్రూతలూగిస్తుంది.
35
`మోనికా` పాటతో చర్చనీయాంశంగా పూజా హెగ్డే
`మోనికా` సాంగ్ అన్ని మాధ్యమాల్లోనూ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అదే సమయంలో పూజా హెగ్డే సైతం వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో పూజా నుంచి పెద్దగా సినిమాలు లేవు.
ఆ మధ్య సూర్యతో నటించిన `రెట్రో` మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు స్పెషల్ సాంగ్ రూపంలో ఆమె చర్చనీయాంశంగా మారడం విశేషం. పూజా స్టెప్పులు మాస్ ఆడియెన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
అయితే ఇందులో హీరోలెవరూ కనిపించకపోవడం గమనార్హం. రజనీకాంత్, నాగార్జున కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ వాళ్లెవరూ ఇందులో లేరు. ఈ పాట కేవలం కమర్షియల్ ఎలిమెంట్ల కోసమే యాడ్ చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి పూజా హెగ్డే తీసుకున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో కేవలం ఒక్క పాట కోసం సుమారు మూడు కోట్లు తీసుకుందని తెలుస్తోంది.
హీరోయిన్‌గా ఒక్కో మూవీకి నాలుగైదు కోట్లు తీసుకుంటుంది పూజా. కానీ ఇందులో ఒక్క పాటకే ఆ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం. `కూలీ` చిత్రం ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతుంది.
55
పూజా హెగ్డే లేటెస్ట్ మూవీస్
పూజా హెగ్డే తెలుగులో సినిమాలు తగ్గించింది. ఇంకా చెప్పాలంటే చేయడం లేదు. ఇప్పుడు తమిళంకే పరిమితమవుతుంది. `రెట్రో` తర్వాత ప్రస్తుతం విజయ్ తో `జన నాయకన్`, `కాంచన 4` చిత్రాల్లో నటిస్తుంది.
హిందీలో `హై జవానీ తో ఇష్క్ హోనా హై` సినిమాలో నటిస్తుంది. పూజాకి కమ్ బ్యాక్ ఇచ్చే మూవీ ఇందులో ఏది అవుతుందో చూడాలి. తెలుగులో చివరగా `ఆచార్య`లో నటించింది పూజా. ఆ తర్వాత మరే తెలుగు మూవీకి సైన్ చేయలేదు.