బ్లాక్‌ డ్రెస్‌లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న పూజా హెగ్డే.. బర్త్ డే ఫోటోలు..

First Published | Oct 15, 2021, 8:47 AM IST

పూజా హెగ్డే ఇటీవల తన బర్త్ ని సెలబ్రేట్‌ చేసుకుంది. టాప్‌ టూ బాటమ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్‌, కొంటె నవ్వులతో గిలిగింతలు పెడుతుంది. తాజాగా పూజా పంచుకున్న బర్త్ డే ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

పూజా హెగ్డే ఈ నెల 13న తన 31వ పుట్టిన రోజుని జరుపుకుంది. కరోనా నేపథ్యంలో సింపుల్‌గానే చేసుకుంది. కానీ బర్త్‌ డే డెకరేషన్‌ లుక్‌ మాత్రం గ్రాండ్‌గానే కనిపిస్తుంది. ఇందులో పూజా ముసి ముసి నవ్వులతో హంట్‌ చేస్తుంది. 
 

టాప్‌ టూ బాటమ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. బ్లాక్‌ ప్యాంట్‌, బ్లాక్‌ జాకెట్‌లో హోయలు పోయింది. కేక్‌తో కొంటె నవ్వులతో అలరిస్తుంది పూజా. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 


ఈ సందర్భంగా అభిమానులకు, ఫ్రెండ్స్ కి, తనకు బర్త్ డే విషెస్‌ తెలిపిన సినీ ప్రముఖులకు థ్యాంక్స్ చెప్పింది పూజా. ఈ ఏడాది తాను ఎప్పటికీ గుర్తిండిపోయే బర్త్ డే ని జరుపుకున్నట్టు తెలిపింది. అభిమానులు, అభిమాన సంఘాలు తనపై చూపించిన ప్రేమ, ఉత్సాహానికి ముగ్దులైనట్టు చెప్పింది. తనకు వస్తోన్న బర్త్ డే విషెస్‌కి ఉబ్బితబ్బిబ్బవుతున్నట్టు తెలిపింది పూజా హెగ్డే. 

బర్త్‌ డే సందర్భంగా పూజా ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ఆమెకి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టార్‌ హీరోల మాదిరిగా ఆమె `hbdpoojahegde` హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేశారు. గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ పండగా చేసుకున్నారు పూజా అభిమానులు. 
 

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే నెంబర్‌ వన్‌ స్థానం ఆమెదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల `అలవైకుంఠపురములో`తో నాన్‌ బాహుబలి హిట్‌ ని తన అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌, బన్నీ, మహేష్‌, పవన్‌ కల్యాణ్‌, విజయ్‌ వంటి టాప్‌ స్టార్లతో కలిసి నటిస్తుంది. 
 

పూజా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో మెరిసింది. అఖిల్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా నేడు(శుక్రవారం) విజయదశమి సందర్భంగా విడుదలైంది. మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. ఈ ఫెస్టివల్‌కి ముందు తన బర్త్ డే రావడం, పండక్కి సినిమా రిలీజ్‌ కావడంతో ఇప్పుడు పూజా సందడి కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. 

వీటితోపాటు పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`లో నటిస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో పూజా.. ప్రేరణ  పాత్రలో కనిపించబోతుంది. ఆమె బర్త్ డే సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త లుక్‌ అదరగొడుతుంది. 
 

మరోవైపు `ఆచార్య`లో మెరుస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన నీలాంబరి పాత్రలో నటిస్తుంది పూజా. పాత్ర చిన్నదైనా ప్రయారిటీ ఉంటుందట. మరోవైపు మహేష్‌తో మరోసారి సినిమా చేయబోతుంది. ఇప్పటికే `మహర్షి`లో జోడి కట్టింది పూజా. ఇప్పుడు మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందబోతున్న చిత్రంలో పూజా ఎంపికైన విషయం తెలిసిందే. `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` తర్వాత మరోసారి తన సినిమాలో పూజాని రిపీట్‌ చేస్తున్నాడు త్రివిక్రమ్‌. తనకు ఆమె లక్కీ మస్కెట్‌గా మారింది.

అలాగే పవన్‌ కళ్యాణ్‌, బన్నీలతోనూ నటించబోతుంది. ఫస్ట్ టైమ్‌ పవన్‌తో జోడి కట్టబోతుందట పూజా. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో హీరోయిన్‌గా పూజా ఎంపికైనట్టు ఇటీవల దర్శకుడు హరీష్‌ చెప్పకనే చెప్పాడు. మరోవైపు బన్నీతోనూ నటిస్తుందన్నారు. బన్నీ `ఐకాన్‌` చిత్రంలో నటించబోతున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇందులో పూజా ఫైనల్‌ అయినట్టు సమాచారం. 
 

ఇదే కాకుండా తమిళంలో దళపతి విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ధనుష్‌, శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో పూజానే నటించబోతున్నట్టు సమాచారం. ఇలా బిగ్‌ మూవీస్‌తో ఫుల్‌ బిజీగా ఉంది పూజా. అంతేకాదు టాలీవుడ్‌లో టాప్‌లోనూ ఉంది. 
 

Latest Videos

click me!