అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీమియర్ షో టాక్

First Published Oct 15, 2021, 7:19 AM IST

Akhil Akkineni లేటెస్ట్ మూవీ ' మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' దసరా కానుకగా నేడు అక్టోబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

'అఖిల్' మూవీతో అక్కినేని అఖిల్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది. కానీ ఆ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దీనితో టాలీవుడ్ పై అఖిల్ ఇంపాక్ట్ ఇంకా పడలేదు. తొలి హిట్ కోసం అఖిల్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో Akhil Akkineni లేటెస్ట్ మూవీ ' మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' దసరా కానుకగా నేడు అక్టోబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై యువతలో మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఫెస్టివ్ సీజన్ కావడంతో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు అదిరిపోవడం ఖాయం. మరి ఈ చక్కటి పరిస్థితులని అఖిల్ అండ్ టీం ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. 

హర్ష(అఖిల్) యూఎస్ లో పనిచేసే కుర్రాడు. తాను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎంచుకోవడం కోసం ఇండియాకు వస్తాడు. అందమైన యువత విభా పాత్రలో Pooja Hegde ఎంట్రీ ఇస్తుంది. ఆమె స్టాండప్ కమెడియన్ గా చేస్తూ ఉంటుంది. పూజా హెగ్డే ని చూడగానే అఖిల్ లో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం పెళ్లి చూస్తూ తిరుగుతూ ఉంటుంది. 

పెళ్లి చూపులు.. పూజా, అఖిల్ మధ్య సన్నివేశాలని దర్శకుడు Bommarillu Bhaskar అద్భుతమైన డైలాగులతో పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని దర్శకుడు మ్యారేజ్ పై డిబేట్ తో సెట్ చేశారు. అది కూడా బాగా కుదిరింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా సాగుతుంది. ఎక్కడా స్లో అనే మాటే ఉండదు. అఖిల్, పూజా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. లెహరాయి, గుంచే గులాబు పాటలు స్క్రీన్ పై సూపర్బ్ అనిపించే విధంగా వచ్చాయి. 

సెకండ్ హాఫ్ కి పర్ఫెక్ట్ స్టేజ్ రెడీ అవుతుంది. పెళ్లి కోసం సరైన అమ్మాయి ఎంపిక విషయంలో అఖిల్ కు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కథ ట్రాక్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో పూజా హెగ్డే సన్నివేశాలు కొన్ని బోరింగ్ గా అనిపిస్తాయి. బలమైన కథ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ తో నడిపించాలనుకోవడం మైనస్ గా మారింది. 

Most Eligible Bachelor

ఓవరాల్ గా Most Eligible Bachelor చిత్రానికి వినోదం, డైలాగులు, రిచ్ విజువల్స్, సంగీతం ప్రాణం పోశాయి అని చెప్పొచ్చు. దసరా ఫెస్టివ్ సీజన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ డీసెంట్ వాచ్ అంటూ ప్రేక్షకులు అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి ఇండియాలో రెగ్యులర్ షోలో ప్రారంభం అయ్యాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి. 


Also Read: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన సమంత.. ఆ మూవీ పేరు చెప్పేందుకు కష్టాలు, 'ఏ మాయ చేశావే' ప్రస్తావన

click me!