అఖిల్‌, పూజా హెగ్డే `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ట్విట్టర్‌ టాక్‌..

First Published Oct 15, 2021, 7:40 AM IST

`అఖిల్‌కి ఈ సారి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ ఇవ్వాలను గట్టిగా ప్రయత్నిస్తున్నాం` అని అల్లు అరవింద్‌ అన్నారు. `మీరు నాకివ్వడం కాదు సర్‌. మీకే నేను హిట్‌ ఇవ్వాలనుకుంటున్నా` ఇది అఖిల్‌ అక్కినేని మాట. ఇదంతా `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంపై అల్లు అరవింద్‌, ఇటు హీరో అఖిల్‌ ఆ మధ్య ట్రైలర్‌ ఈవెంట్‌లో చెప్పుకున్న మాటలు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` సినిమాకి `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వం వహించగా, జీఏ2 పతాకంపై బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) విజయదశమి సందర్భంగా విడుదలైంది. 

సినిమా యూఎస్ ప్రీమియర్స్ రాత్రి నుంచే పడ్డాయి. ప్రస్తుతం ట్విట్టర్లో అభిమానులు తమ కామెంట్లని పంచుకుంటున్నారు. సినిమా ఎలా ఉందో తమదైన రివ్యూలిస్తున్నారు. ట్విట్టర్‌లో సినిమా చూసిన వాళ్లు ఏమంటున్నారో, సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. 

సినిమాకి మిక్స్ డ్‌ టాక్ వినిపిస్తుంది. సరైన ప్రమోషన్‌ చేయకపోవడం సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందంటున్నారు. `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` డీసెంట్‌ రొమాంటిక్‌ కామెడీ అని అంటున్నారు. సంగీతం సినిమాకు ప్రాణం పోసిందంటున్నారు. డీసెంట్‌ డైలాగ్‌లతో వచ్చే కామెడీ ఆకట్టుకుంటుందట. సెకండాఫ్‌ ఇంకా బెటర్‌గా చేస్తే బాగుందంటున్నారు.
 

దసరాకి మంచి ఫన్‌ మూవీ అని, క్లీన్‌గా ఉందని అంటున్నారు. విజయదశమి టపాసు గట్టిగా పేలిందని మరికొందరు అంటున్నారు. హిట్‌ పడిపోయిందని, దీనిపై నెగటివ్‌ రిపోర్ట్ చేయడం సరైనది కాదంటున్నారు అక్కినేని అభిమానులు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయట. భార్యాభర్తల మధ్య జోక్స్ అదిరిపోయాయని, డిఫరెంట్‌ టైటిల్‌ కార్డ్స్ తో సినిమా స్టార్ట్ అవుతుందట. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇదని అంటున్నారు. అయితే పూజా హెగ్డేని మాత్రం స్టాండప్‌ కమేడియన్‌గా చూడలేకపోతున్నామని చెబుతున్నారు నెటిజన్లు.
 

ఫస్టాఫ్‌ ఎంటరైనింగ్‌గా ఉందట. సెకండాఫ్‌లో కథని నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడట. దీంతో అఖిల్‌కి సూపర్‌ హిట్‌ని అందించలేకపోయారని కొందరు ట్వీట్‌ చేశారు. దీంతో సినిమా ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్‌ చేయలేకపోయిందనే టాక్‌ వస్తోంది. కొన్ని కామెడీ సీన్లు బాగున్నాయని, అది తప్ప సినిమాలో ఏదీ ఆకట్టుకోలేకపోయిందనే క్రిటిసైజ్‌ కూడా వినిపిస్తుంది.

సెకండాఫ్‌ డిజప్పాయింట్‌ చేయడం వల్ల ఫస్టాప్‌ బాగున్నా, నిరాశే ఎదురవుతుందట. ఇదొక యావరేజ్‌ చిత్రమని, రెండు పాటలు, కథని లైటర్‌ వేలో చెప్పిన విధానం ఫర్వాలేదని, కొంత మందికి మాత్రమే పరిమితమయ్యే చిత్రమని అంటున్నారు. లాజికల్‌గా లేదని, చాలా డ్రాగ్ ఉందని, కామెడీ కూడా చాలా సిల్లీగా ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. దీంతో ఇదొక ఫ్లాప్‌ సినిమాగా వర్ణిస్తున్నారు.

అఖిల్‌ మాత్రం తన పాత్రలో అదరగొట్టాడట. నటుడిగా ఈ సినిమాతో నిరూపించుకున్నాడట.  పూజా కూడా తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెబుతున్నారు. పాత్రకి న్యాయం చేశారని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్ సీన్లు బాగున్నాయట. క్లైమార్స్ లో పూజా అయ్యగారు నవ్వులుపూయించారట. దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ సినిమాకి న్యాయం చేయకపోయాడని, స్క్రీన్‌ప్లే చాలా బ్యాడ్‌గా ఉందని, కథలో బలం లేదని అంటున్నారు. 

Most Eligible Bachelor

ఫైనల్‌గా సినిమాకి మిక్స్ డ్‌ టాక్ వస్తుంది. చాలా వరకు నెగటివ్‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. అఖిల్‌కి మళ్లీ నిరాశ తప్పదనే రిపోర్ట్ లు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. `ఏషియా నెట్‌ తెలుగు` పూర్తి రివ్యూ కోసం వేచి ఉండండి. 

`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సినిమాపై టీమ్‌లో అసంతృప్తి ఉన్నట్టు వార్తలొచ్చాయి. అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాలను లైట్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అఖిల్‌కి సరైన హిట్‌ పడలేదు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు,అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్‌లోనూ దీన్నితీసుకురావాలని, ఓటీటీ ఆఫర్స్ ని కూడా తిరస్కరించారు. నాగార్జున సైతం ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. టాలీవుడ్‌లో పూజా హెగ్డే లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమె నటించిన సినిమాలు విజయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్‌కి.. పూజా అయినా హిట్‌ ఇస్తుందని భావించారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌ ని చూస్తుంటే మళ్లీ నిరాశ తప్పదనే కామెంట్లు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే పూర్తి రివ్యూ వచ్చేంత వరకు వే

click me!