బికినీలో కేక్ కట్ చేసిన పూజా హెగ్దే.. బుట్టబొమ్మ బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా..

First Published | Oct 14, 2023, 5:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తన బర్త్ డే సందర్భంగా మాల్దీవులకు వెళ్లంది. దీంతో అక్కడే కేట్ కట్ చేసింది. కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్  పూజా హెగ్దే (Pooja Hegde)  ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. నిన్న తన పుట్టిన  రోజు సందర్భంగా ఓ రోజు ముందుగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడే బర్త్ డేను సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో కొన్ని ఫొటోలను పంచుకుంది.
 

బర్త్ డే గర్ల్ చిన్న కేకును కట్ చేసి పుట్టిన రోజును జరుపుకుంది. అయితే బికినీలోనే ఈ ముద్దుగుమ్మ కేక్ ను కట్ చేసింది. ఓవైపు పరువాల ప్రదర్శన చేస్తూనే మరోవైపు బర్త్ డే వైబ్స్ ను తెప్పించింది. మొత్తానికి బీచ్ లో బుట్టబొమ్మ ఐఫీస్ట్ కలిగించింది. 


నిన్న (అక్టోబర్ 13న) పూజా హెగ్దే బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈఏడాది మరింతగా కలిసి రావాలని ఆకాంక్షించారు. ఆమె ఫొటోలను వైరల్ చేశారు. ఈ క్రమంలో బికినీలో కేక్ కట్ చేస్తున్న పిక్స్ కూడా వైరల్ గా మారాయి. 
 

ఇక పూజా హెగ్దే కూడా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అభిమానుల ఆశీర్వాదానికి థ్యాంక్యూ చెపింది.  ఇక బుట్టబొమ్మ చాలా రోజుల తర్వాత ఇలా తన బర్త్ డేకు దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఈ బర్త్ డేతో పూజా హెగ్దే 33వ ఏటా అడుగుపెట్టింది. ఇప్పటికే వృత్తి పరంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. మున్ముందుకు మరిన్ని సినిమాలతో అలరించబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

కెరీర్ విషయానికొస్తే.. కొన్నాళ్లుగా పూజా హెగ్దేకు సినిమాల పరంగా కలిసి రావడం లేదు. ఎంత ప్రాజెక్ట్ లో నటించినా ఈ ముద్దుగుమ్మకు సరైన ఫలితం దక్కడం లేదు. చివరిగా ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ హిందీ చిత్రంతో అలరించింది. తెలుగులోనూ విడుదలైంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు. 

Latest Videos

click me!