Kajal: దొండపండులాంటి పెదాలు, కళ్లల్లో విరహం.. జాలిలాంటి డ్రెస్‌లో కాజల్‌ మత్తెక్కించే పోజులు..వీకెండ్‌ ట్రీట్‌

Published : Oct 14, 2023, 04:04 PM ISTUpdated : Oct 14, 2023, 06:38 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో చందమామగా పేరుతెచ్చుకుంది కాజల్‌ అగర్వాల్‌. క్యూట్ అందాలతో మెప్పించింది. బిగినింగ్‌ నుంచి ఇప్పటి వరకు స్లిమ్‌గానే కనిపిస్తూ లక్షలాది మందికి డ్రీమ్‌ గర్ల్ అయ్యింది.   

PREV
17
Kajal: దొండపండులాంటి పెదాలు, కళ్లల్లో విరహం.. జాలిలాంటి డ్రెస్‌లో కాజల్‌ మత్తెక్కించే పోజులు..వీకెండ్‌ ట్రీట్‌

కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal) ఇప్పుడు తనలోని 2.0 ని చూపిస్తుంది. నెక్ట్స్ వెర్షన్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తల్లి అయినా తర్వాత హాట్‌ సైడ్‌ టర్న్ తీసుకుంది. వేడి వేడి అందాలను వడ్డిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. 
 

27

తాజాగా కాజల్‌ నయా డ్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. జాలి లాంటి డ్రెస్ ధరించి హోయలు పోయింది. కళ్లల్లోనే విరహాన్ని నింపుకుని దాన్ని ఇప్పుడు కుర్రాళ్లపై వదులుతుంది. తన హాట్‌ పోజులతో నెటిజన్లన బాడీలో టెంపరేచర్‌ పెంచుతుంది. వైరల్‌ అవుతుంది. మరోవైపు దొండపండులాంటి పెదాలతో టెంప్ట్ చేస్తుంది.

37

కాజల్‌ ఇప్పుడు `భగవంత్‌ కేసరి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్‌ నటించింది. తన పాత్రకి ప్రయారిటీ ఉంటుందని సమాచారం. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాజల్‌ ఇలా వెరైటీ, ట్రెండీ, ట్రెడిషనల్‌ లుక్‌లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. 
 

47

కాజల్‌ పెళ్లి తర్వాత కొంత ఆచితూచి సినిమాలు చేస్తుంది. బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలకు, ముఖ్యంగా తన పాత్రకి కొంత ప్రయారిటీ ఉన్న వాటికే ప్రాధాన్యతనిస్తుంది. అందుకే నటిగానూ తనలోని నెక్ట్స్ వెర్షన్‌ చూపిస్తుంది. 
 

57

ఆమె `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కూడా చేస్తుంది. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కాజల్‌ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది. ఇందులో ఆమె చీరకట్టి పోలీస్‌ డ్యూటీ చేసిన తీరు వాహ్‌ అనిపిస్తే, క్రిమినల్‌ చేత నిజం చెప్పించిన తీరు మరింత ఆకట్టుకుంది. 

67

అందాల భామ కాజల్‌ సుకుమారమైన చేతులతో విలన్ ని అంతగా చితకబాధడటం కొత్తగా ఉంది. అంతే అందంగా మెస్మరైజ్‌ చేసే ఈ భామలో ఆ సీరియస్‌ కోసం కూడా ఎంతో ముచ్చటగా ఉంది. అందుకే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

77

దీంతోపాటు కాజల్‌ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు మొగ్గు చూపుతుందట. ఇప్పటికే ఆమె స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. పైగా పెళ్లై, కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు గ్లామర్‌ పాత్రలు చేయలేదు. అందుకే మహిళా ప్రధానమైన చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుంది. త్వరలోనే ఆమె గుడ్‌ న్యూస్‌ చెప్పబోతుందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories