చుడిదార్ లో దివి బ్యూటీఫుల్ లుక్.. సింపుల్ గా మెరిసినా నెటిజన్ల గోల మాములుగా లేదుగా..

First Published | Oct 14, 2023, 3:43 PM IST

మొన్నటి వరకు బిగ్ బాస్ దివి నెట్టింట అందాల జాతర చేసింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెరిసి గ్లామర్ విందుతో మతులు పోగొట్టింది. కానీ తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో పద్ధతిగా దర్శనమిచ్చింది. 
 

నటి దివి వాద్య (Divi Vadthya)  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనలో మొన్నటి వరకు రచ్చ లేపింది.
 

చీరకట్టినా.. ట్రెండి వేర్ ధరించినా హాట్ నెస్ ఏమాత్రం తగ్గించేది కాదు. స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల వరద పారించింది. మత్తు ఫోజులతో, గ్లామర్ విందుతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో మంత్రముగ్ధులను చేస్తూ వచ్చింది.


ఇక తాజాగా మాత్రం ఈ బ్యూటీ పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. చాలా రోజుల తర్వాత దివి నిండు దుస్తులు ధరించి దర్శనమివ్వడంతో ఫ్యాన్స్  ఫుల్ ఖుషీ అవుతున్నారు. సింపుల్ చుడిదార్ లోనూ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుందంటూ అభిప్రాయపడుతున్నారు. 

ఇక ఫ్యాన్స్ లైక్స్ తో పిక్స్ వైరల్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు దివి రూపసౌందర్యాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. తమ కామెంట్లకు రిప్లై ఇవ్వాలని, దివిపై చాలా అభిమానం ఉందంటూ, గార్జియస్ అంటూ, రకరకాల కామెంట్లతో పొగుడుతున్నారు. తన ట్రెడిషనల్ లుక్ కు ఫిదా అవుతున్నారు. 
 

ఇక దివి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. దివి వాద్య పూర్తి పేరు. మోడలింగ్ తో కెరీర్ ను ప్రారంభించింది. 2017లో మోడల్ గా  మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రింట్ షూట్స్ చేసింది. పలు ఫ్యాషన షోల్లోనూ ర్యాంప్ వ్యాక్ చేసి ఆకట్టుకుంది. 
 

2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహార్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసింది. అలాగే ‘క్యాబ్ స్టోరీస్’, ‘జిన్నా’ వంటి చిత్రాలతోనూ అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి సీజన్ 4 ద్వారా ఎంట్రీ ఇచ్చింది. చిరు ‘గాడ్ ఫాదర్’లోనూ మెరిసింది. ప్రస్తుతం Pushpa2 The Ruleలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!