టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా హెగ్దే.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది ఈ బ్యూటీ నటించిన ‘రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3’ సినిమాలు ఒకదాని తర్వాత మరోకటి రిలీజ్ కావడం విశేషం. అయితే ‘ఎఫ్3’ మినహా మిగితా చిత్రాలు పెద్దగా విజయవంతం కాలేదు. అయినా ఈ బ్యూటీ క్రేజ్ పై ఎలాంటి ప్రభావితం చేయలేదు.