కేజీఎఫ్ మొదటి భాగంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 రాబోతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కానుండగా అన్నీ కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.