నవరాత్రి స్పెషల్‌లో భాగంగా వీరిద్దరు సందడి చేసి సినిమా గురించి విశేషాలను పంచుకున్నారు. మంచి లాఫ్టర్ థెరఫీ లాంటి చిత్రమన్నారు. అదే సమయంలో ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అందులో భాగంగా అఖిల్.. పూజాని ఇంప్రెస్ చేసిన వాళ్లు గేమ్‌లో విన్నర్ గా నిలుస్తారని చెప్పారు. ఈ టాస్క్ లో శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్, సిరి, జెస్సీ, మానస్, విశ్వ పాల్గొన్నారు.