MAA Elections: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్, నిత్యామీనన్, రాంచరణ్.. పోలింగ్ కేంద్రం వద్ద తారలు

First Published | Oct 10, 2021, 10:04 AM IST

ఎప్పుడూ లేని విధంగా 'మా' ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. 

ఎప్పుడూ లేని విధంగా 'మా' ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.  అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఇద్దరూ హోరా హోరీగా ప్రచారం నిర్వచించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 

వీటన్నింటికి నేటితో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. దీనితో టాలీవుడ్ సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ నెలకొని ఉంది. 


ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జీవిత రాజశేఖర్, హేమ, బెనర్జీ, శ్రీకాంత్, నాగినీడు లాంటి ప్రముఖ నటులు ఉన్నారు. జీవిత జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక మంచు విష్ణు ప్యానల్ లో రఘుబాబు, బాబు మోహన్, కమెడియన్ పృథ్వి, శివబాలాజీ, కరాటే కళ్యాణి, అర్చన లాంటి సెలెబ్రిటీలు ఉన్నారు. బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. 

గత నెలరోజుల్లో మా ఎన్నికల నేపథ్యంలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేష్ విభేదాల కారణంగా బయటకు వచ్చారు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం MAA Election పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధికారులు ఎన్నికకు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ 900 ఓట్లు కూడా లేని మా అసోసియేషన్ ఎన్నికలో వ్యక్తిగత దూషణలు అనవసరం అని పేర్కొన్నారు. 

ఇక క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.నిత్యామీనన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి జోడిగా భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తోంది. 

అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, విష్ణు, మనోజ్, నరేష్, నటుడు ఉత్తేజ్, శ్రీకాంత్ లాంటి సెలెబ్రిటీలంతా పోలింగ్ కేంద్రం వద్దే ఉండడంతో సందడి నెలకొంది. 

మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ రోజే విజేతని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read: MAA elections: చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చీలిపోదు, చిరు, మోహన్ బాబు మిత్రులు - పవన్ కళ్యాణ్

Latest Videos

click me!