PS 1 Review: పొన్నియిన్ సెల్వన్ ప్రీమియర్ టాక్... మణిరత్నం మ్యాజిక్ చేశాడా? మరో బాహుబలి అవుతుందా?

First Published Sep 30, 2022, 5:59 AM IST

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్. భారీ తారాగణంతో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ మూవీ నేడు థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రీమియర్స్ ప్రదర్శన ఇప్పటికే ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దాం..

Ponniyin Selvan Review

కథ 

9వ శతాబ్దంలో జరిగిన చోళుల కథగా పొన్నియిన్ సెల్వన్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. దీనికి ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారం. చోళులు వారి సమకాలీయులైన పల్లవులు, పాండ్యులతో శత్రుత్వం కొనసాగించారు. మొత్తంగా చెప్పాలంటే చోళ రాజుల వీర గాథే పొన్నియిన్ సెల్వన్ మూవీ. 
 

Ponniyin Selvan Review

తమిళ సినిమా ప్రైడ్ గా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ప్రచారం చేశారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయరాం ఇలా లెక్కలు మించిన స్టార్ క్యాస్ట్ మూవీలో భాగమయ్యారు. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల చేశారు.

Ponniyin Selvan Review

పొన్నియిన్ సెల్వన్ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ ఉన్నాయి. యూఎస్ లో ఇది రికార్డు ఓపెనింగ్స్ నమోదు చేస్తుంది. ఇప్పటికే $ 1 మిలియన్ ప్రీమియర్ వసూళ్లకు చేరువైంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే నాటికి ఈ ఫిగర్ $1 నుండి 1.5 మిలియన్ ఉండవచ్చని అంచనా. ఓ తమిళ చిత్రానికి ఇది రికార్డు ఓపెనింగ్ అని చెప్పాలి. 

Ponniyin Selvan Review

ఇక పొన్నియిన్ సెల్వన్ తెలుగు వెర్షన్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ లోనే ఒక పెద్ద వార్ ఎపిసోడ్ తో ప్రేక్షకుల అంచనాలు పెంచేశాడు. యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఒకింత అలరిస్తాయి. 9వ శతాబ్దం నాటి సెటప్, పరిస్థితులు తీర్చిదిద్దిన తీరు బాగుంది.

Ponniyin Selvan Review


పొన్నియిన్ సెల్వన్ మూవీ గురించి చెప్పుకోవాల్సిన విషయాల్లో విజువల్స్, మ్యూజిక్, ప్రధాన నటుల పెర్ఫార్మన్స్, స్టోరీ, పాటల చిత్రీకరణ. ఏ ఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మణిరత్నం మార్క్ షాట్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్, జయం రవి తో పాటు కీలక రోల్స్ చేసిన నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుడికి మంచి అనుభూతి పంచుతుంది. 
 

Ponniyin Selvan Review

ముఖ్యంగా కార్తీ రోల్, ఆయన నటన గురించి చెప్పుకోవాలి. ఉన్నత నిర్మాణ విలువలతో గ్రాండ్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ కథాబలం తో నడిచే చిత్రం. స్క్రీన్ ప్లే పర్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా నిరాశపరచకుండా సాగుతుంది. ఉత్కంఠ రేపే యుద్ధ సన్నివేశాలు, హృదయాలు దోచే ఎమోషనల్ కనెక్షన్ అయితే సినిమాలో మిస్. ఫస్ట్ హాఫ్ వరకు మణిరత్నం సినిమాను పాత్రలు పరిచయం, ఈ కథ ఏమిటీ? అని చెప్పే ప్రయత్నం చేశారు. 
 

Ponniyin Selvan Review


ఇతర పీరియాడిక్ వార్ మూవీస్ తో పొన్నియిన్ సెల్వన్ ను పోల్చుకోకూడదు. 9వ శతాబ్దం నాటి చోళుల చరిత్రను కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా చేప్పే ప్రయత్నం జరిగింది. ఒక బలమైన కథ అనేక పాత్రల సమ్మేళనంగా సాగుతుంది. ఒక ప్రాంతానికి చెందిన చరిత్ర, నేటివిటీ కావడం సినిమాకు ఒకింత మైనస్. పాత్రల పేర్లు ప్రేక్షకులకు ఎక్కవు. 
 

Ponniyin Selvan Review


మొత్తంగా పొన్నియిన్ సెల్వన్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పీరియాడిక్ విజువల్ డ్రామా. విజువల్స్, సంగీతం, కథ, ప్రధాన నటుల పెర్ఫార్మన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అయితే పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ అనగానే ఉత్కంఠ గొలిపే యుద్ధ సన్నివేశాలు ఊహించుకోవడం సాధారణం. వాటి కంటే దర్శకుడు కథ, ఎమోషన్స పైనే దృష్టి పెట్టాడు. అయితే ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. 
 

Ponnniyin Selvan


ప్రీమియర్ టాక్ ప్రకారం పొన్నియిన్ సెల్వన్ డీసెంట్ అటెంప్ట్. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయం. తమిళంలో ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చేలా కనిపిస్తుంది. మరి ఇతర భాషల్లో ఎంత వరకు రాణిస్తుందనేది చూడాలి. 

click me!