కారు డిక్కీ తీయను పరువు పోతుంది... పోలీసులను వేడుకున్న స్టార్ హీరోయిన్!

Published : May 30, 2024, 04:50 PM IST

పోలీసులకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. హీరోయిన్ నివేద పేతురాజ్ పోలీసులకు సహకరించలేదు. తనిఖీ చేయడానికి కారు డిక్కీ ఓపెన్ చేయమనగా... పరువుకు సంబంధించిన మేటర్ చేయను అంది. ఇదంతా షూట్ చేస్తున్న కెమెరాను ఆమె కింద్ర పడేసింది.   

PREV
15
కారు డిక్కీ తీయను పరువు పోతుంది... పోలీసులను వేడుకున్న స్టార్ హీరోయిన్!

నివేద పేతురాజు పరిచయం అక్కర్లేని పేరు. మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం పలు చిత్రాల్లో నటించింది. బ్రోచేవారెవరురా. అలా వైకుంఠపురంలో వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో మూవీలో నివేద సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. 


 

25

తెలుగులో నివేద చివరి చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలైంది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. నివేద పేతురాజ్ కి కాలం కలిసి రాలేదు. ఆమె స్టార్ కాలేకపోయింది. సెకండ్ హీరోయిన్ , సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే దర్శకులు పరిమితం చేశారు. 

35

కాగా నివేద పేతురాజ్ సంచలన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె కారును పోలీసులు అడ్డగించారు. కారు డిక్కీలో ఏమి ఉందో చూపించాలని అడిగారు. పేపర్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండని నివేద అన్నారు. లేదు మీరు కారు డిక్కీ ఓపెన్ చేసి సహకరించండని పోలీసులు నివేదతో అన్నారు.

45
Nivetha Pethuraj

పరువుకు సంబంధించిన విషయం. కారు డిక్కీ ఓపెన్ చేయడం కుదరదని నివేద మొండికేసింది. ఇదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి చేతిలోని ఫోన్ తీసుకుని విసిరేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కారు డిక్కీ ఓపెన్ చేయమంటే నివేద ఎందుకు చేయలేదు ? ఆమె కంగారును కారణం ఏమిటీ? అనే సందేహాలు మొదలయ్యాయి. 


 

55
nivetha Pethuraj

ఈ ఘటనపై పోలీసు వర్గాల్లో చర్చ లేదు. అధికారిక ప్రకటన లేదు. కాబట్టి ఇది ఫ్రాంక్ కూడా కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. నిజం ఏమిటో త్వరలో తెలియనుంది. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ ఇలా వినూత్నంగా చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories