విశ్వక్ సేన్ తాజా సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన విషయం అందరికీ తెలుసు. కాగా, ఈ వేడుకలో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉన్నట్లుగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే బాలయ్య స్టేజి మీద అంజలిని పక్కకు తోయడంపై నెటిజనులు భగ్గుమన్నారు. అగ్ర హీరో ఆ విధంగా చేయడం తగదని పోస్టులు పెడుతున్నారు. దీనిపై విశ్వక్ సేన్, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ స్పందించారు.