Brahmamudi: పోలీసులకి పట్టుపడ్డ రాజ్ దంపతులు.. దొంగతనం చేసి ఇంట్లో వాళ్లకి దొరికిపోయిన రాహుల్!

First Published | Oct 18, 2023, 9:02 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిన ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో డ్రెస్ లో ఉన్న భార్యని చూసి ఏంటి డ్రెస్ చేంజ్ చేసేసావ్ అని అడుగుతాడు రాజ్. మీరే కదా బైక్ మీద వెళ్దాం అన్నారు అందుకే కంఫర్ట్ గా ఉంటుందని డ్రెస్ వేసాను అంటుంది కావ్య. సరే పద అని చెప్పి నెమ్మదిగా దొంగల్లాగా ఇద్దరు బయటకు వస్తారు. బుల్లెట్ స్టార్ట్ చేయకుండా తోసుకుంటూ వస్తున్న భర్తని చూసి మీరేమైనా సెటప్ ని వేసుకొని బయటకు వెళ్తున్నారా ? ఎందుకు అంత భయపడుతున్నారు అంటుంది కావ్య.
 

ఇంత రాత్రి అప్పుడు బయటకు వెళ్లడం బాగోదని అంటూ బుల్లెట్ ని కొంత దూరం తోసుకుంటూ వెళ్లి అక్కడ స్టార్ట్ చేసి ఇద్దరు కిళ్లి కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఎక్కడ చూసినా పాన్ షాప్ లో క్లోజ్ చేసి ఉంటాయి. అయితే ఒక పాన్ షాప్ అతను పక్కకు వెళ్తూ షట్టర్ క్లోజ్ చేసి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ వాళ్ళు షాప్ దగ్గర లైట్ వేసి ఉంది అనుకొని షాప్ దగ్గరికి వస్తారు.


షట్టర్ కి తాళం వేసి ఉండకపోవడంతో మా బాబాయ్ లాగా మతిమరుపు వాడేమో తాళం వేయలేదు పద మనం వెళ్లి కిళ్లిలు కట్టుకుందాం అంటాడు రాజ్. అమ్మో దొంగతనం గానా వద్దు అంటుంది కావ్య. ఏం నువ్వెప్పుడూ దొంగతనం చేయలేదా అంటాడు రాజ్. మాది నిజాయితీగల ఫ్యామిలీ అంటుంది కావ్య. అవును మరి మాది పెద్ద గజదొంగలు ఫ్యామిలీ అని వెటకారంగా అంటాడు రాజ్.
 

మళ్లీ తనే ఇప్పుడు నీకు కిళ్లి తినాలని ఉందా లేదా అని అడుగుతుతాడు రాజ్. సరే పదండి అని చెప్పి షట్టర్ లోపలికి వెళ్లిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసేస్తుంది కావ్య. ఎందుకలా అని అడుగుతాడు రాజ్.దొంగతనం చేసేటప్పుడు పక్కాగా చేయాలి అంటుంది కావ్య. సరే అని చెప్పి కావ్యకి స్వీట్ పాన్ కట్టి ఇస్తాడు రాజ్. అక్కడ ఉన్న జర్దా ని చూసిన కావ్య ఏంటిది, వాసన ఇలా ఉంది అంటుంది.
 

దానిని జర్దా అంటారు నీలాంటి వాళ్ళు తింటే కళ్ళు బైర్లు కమ్ముతాయి అంటాడు. మరి మీరు తింటే అంటుంది కావ్య. నాది ఉక్కు బాడీ ఏం తిన్నా ఏమి జరగదు అంటాడు రాజ్. సరే మీరు నాకు స్వీట్ పాన్ కట్టారు కదా నేను మీకు మసాలా పాన్ కడతాను అంటుంది కావ్య. ఈ లోపు షాప్ అతను షాప్ దగ్గరికి వచ్చేసరికి లోపల నుంచి మాటలు వినబడతాయి వీళ్ళెవరో దొంగల్లాగా ఉన్నారు అనుకోని పోలీసులకి ఫోన్ చేస్తాడు.
 

 ఐదు నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పోలీస్. మరోవైపు లోపల  మసాలా  పాన్ కడుతూ అందులో జర్దా వేసేస్తుంది కావ్య. మీది ఉక్కు బాడీ అన్నారు కదా చూద్దాం అంటూ ఆ కిళ్లి ని అతని నోట్లో పెడుతుంది. అది తింటున్న రాజ్ కి కళ్ళు తిరుగుతాయి ఏంటిది ఇలా ఉంది అని అడుగుతాడు. ఏదైతేనేమి మీది స్ట్రాంగ్ బాడీ కదా తినండి అంటుంది కావ్య. వాళ్ళు పాన్ తింటూ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో పోలీస్లు వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తారు.
 

 షాప్ అతను చూడండి సార్ నా షాప్ లో దొంగతనం చేయటానికి వచ్చారు అంటాడు. మేము దొంగతనం చేయడానికి రాలేదు అని అంటాడు రాజ్. కానీ జర్దా తినడం వల్ల నాలుక మందపడి మాట ముద్దగా వస్తుంది. అతను మాట్లాడిన మాటలు అర్థం కాక నాలిక పంచబడటానికి అతనికి ఏమైనా ఇవ్వు అంటాడు పోలీస్. అప్పుడు రాజ్ కి నీళ్లు ఇస్తాడు షాప్ అతను. నీళ్లు తాగి నోరు క్లీన్ చేసుకున్న తర్వాత  మాట క్లియర్ గా వస్తుంది.
 

అప్పుడు మేము దొంగతనం చేయడానికి రాలేదు అంటాడు రాజ్. మరి లోపల ఎందుకు దూరారు అంటాడు  పోలీసు. జరిగిందంతా చెప్తుంది కావ్య. వాళ్ళు ఎవరో కూడా చెప్పాలి అనుకుంటుంది కానీ రాజ్ ఆపేస్తాడు. ఇంట్లో ఈ విషయం తెలిసింది అంటే చండాలంగా ఉంటుంది అంటూ వారిస్తాడు. తరువాయి భాగంలో ఇంట్లో దొంగతనం చేసే అందరి ముందు దొరికిపోతాడు రాహుల్.

Latest Videos

click me!