ఎమ్మెల్యేగా ఉన్నంత వరకూ.. బుల్లితెరపై సందడి చేసింది రోజా.. మంత్రి అయిన తరువాత నిబంధనల ప్రకారం సినిమాలకు, వెండితెర, బుల్లితెరలకు దూరం అయిన రోజా.. త్వరలో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక వేళ తాను రీ ఎంట్రీ ఇస్తే మాత్రం మహేష్ బాబుతో నటిస్తుదంట కాని.. మహేష్ కు మదర్ గా మాత్రం నటించనంటోంది రోజ.
తాజాగా రోజా ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. రెస్టారెంట్ ఓపెనింగ్ తరువాత ఆమె మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సంద్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు ఏపీ మినిస్టర్. ఇక రోజా మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని నాకు కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే మహేష్ బాబుకు అమ్మ, అత్త పాత్రలలో మాత్రం తాను నటించనంటున్నారు. అది మాత్రం తనను అడగొద్దంటున్నారు రోజా.
అయితే ఒక వేళ మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ వస్తే.. వదులుకోనని.. అయితే అది కూడా ఆయనకు అక్క, వదిన పాత్రలలో నటించాలని ఉందని రోజా తన మనస్సులోని కోరికను వెల్లడించారు. మహేష్ బాబు అనుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ఆమె అడిగితే ఆయన కాదనడు కదా అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం వివాదాల్లో నలుగుతున్నారు రోజా. తన గురించి తన సినిమాలు.. ఇతర విషయాలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన వివాదాస్పంద వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. రోజాకు ఈ విషయంలో సపోర్ట్ చేసిన మీనా, రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బులాంటి హీరోయిన్లను కూడా గట్టిగా ట్రో ల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక ప్రస్తుతం రాజకీయాలకే పరిమితం అయిన రోజా..త్వరలో సినిమాల్లో కనిపిస్తారన్న న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా మహేష్ బాబుతో నటిస్తాను అని ఆమె అనడంతో ప్రస్తతం ఈ వార్త ట్రెండింట్ లో ఉంది.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత ఆయన కంప్లీట్ గా రాజమౌళి ఆరాలోకి వెళ్ళిపోబోతున్నట్టు తెలుస్తోంది. జక్కన్న మహేష్ తో పాన్ వరల్ట్ స్థాయిలో.. అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేశాడు. మరి ఈసినిమా ఎన్నేళ్లు షూటింగ్ జరుపుకుంటుందో చూడాలి.