నొప్పితో బాధపడుతున్న ఏంజెల్ దగ్గరికి వచ్చి ఆమెని పైకి లేపి చైన్ ఆమెకి ఇస్తుంది. చాలా థాంక్స్ ఇది నా సెంటిమెంట్ చైన్ అంటుంది ఏంజెల్. కొన్ని వస్తువుల మీద సెంటిమెంట్ అలా ఉండిపోతుంది వాటికి ఏమైనా అయితే భరించలేము అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వసు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతున్న ఏంజెల్ ని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది విశ్వనాథం గారి ఇల్లు అని, ఏంజెల్ విశ్వనాథం గారి మనవరాలు అని తెలుసుకుంటుంది.