Guppedantha Manasu: భార్యకి, కొడుక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర.. తల్లికి అదిరిపోయే షాకిచ్చిన శైలేంద్

Published : Jun 20, 2023, 10:49 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. తమ్ముడు జీవితం బాగోవాలని, అతని కొడుకు కనిపించాలని తపన పడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: భార్యకి, కొడుక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర.. తల్లికి అదిరిపోయే షాకిచ్చిన శైలేంద్

 ఎపిసోడ్ ప్రారంభంలో ఎన్ని ఎత్తులు వేసినా నువ్వు గెలవలేవు విశ్వం అంటుంది ఏంజెల్. నువ్వు అలా మాట్లాడకూడదు తాత గారికి సపోర్ట్ గా మాట్లాడాలి అంటాడు రిషి. నువ్వు ఎప్పుడు మీ తాత గారికి సపోర్ట్ గానే ఉండేవాడివా అని అడుగుతుంది ఏంజెల్. ఉండాలని అనుకున్నాను కానీ ఒక నింద నన్ను నా కలలకి దూరం చేసింది.

29

 నీ ఆశయాన్ని నెరవేర్చలేకపోతున్నాను తాతయ్య నన్ను క్షమించు అని మనసులోనే అనుకుంటాడు. రాంగ్ స్టెప్స్ వేసి గేమ్ లో ఓడిపోయి విశ్వనాధాన్ని గెలిపిస్తాడు రిషి. నాకోసం ఓడిపోయావా అని అడుగుతాడు విశ్వనాథం. అలాంటిదేమీ లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.

39

ఇన్ని సంవత్సరాలైనా అతనిలోని ఆ మూడీనెస్ ని తగ్గించలేకపోతున్నాను అంటుంది ఏంజెల్. నా అనుభవంతో చెప్తున్నాను అతనికి చాలా గట్టి దెబ్బ తగిలింది అది మాన్పించే బాధ్యత ఒక ఫ్రెండ్ గా నీదే అంటాడు విశ్వనాథం. అందుకే తాతయ్య అప్పుడప్పుడు తనని బయటకు తీసుకు వెళ్తూ ఉంటాను అంటుంది ఏంజెల్. గుడ్ ఫ్రెండ్ అంటూ మనవరాల్ని మెచ్చుకుంటాడు విశ్వనాథం.
 

49

 మరోవైపు కొడుకు కోసం బాధపడుతున్న మహేంద్ర దగ్గరికి వెళ్లి  బాధపడకండి రిషి తప్పకుండా దొరుకుతాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని చెప్తుంది ధరణి. ఆ మాటలు విన్న శైలేంద్ర భార్యని పక్కకి పిలిచి నువ్వేంటి రిషి వస్తాడు అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అసలు వస్తాడో రాడో ఎక్కడ ఉన్నాడు అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో అని అంటూ ఉండగానే అతని చెంప చెళ్ళు మంటుంది. షాక్ అయి చూసేసరికి ఎదురుగా జగతి ఉంటుంది.
 

59

అందరూ ఏం జరిగింది అంటూ అక్కడికి వస్తారు. రిషి గురించి ఈయన తప్పుగా మాట్లాడారు అందుకే చిన్న అత్తయ్య కొట్టారు అని చెప్తుంది ధరణి. రుషి గురించి అలా మాట్లాడతావా అంటూ కొడుకు కాలర్ పట్టుకుని మందలిస్తాడు ఫణీంద్ర. వింటే నాకే ఇంత కోపం వస్తుంది తను కొట్టడంలో తప్పులేదు. అయినా నువ్వు రిషి నేను బాబాయ్ ఉన్నంత అన్యోన్యంగా ఉండాలి వీలైతే రిషి ని వెతికి తీసుకురా అని చెప్తాడు.
 

69

 భార్య వైపు తిరిగి నీ కొడుకు ఆలోచనలు అదుపుతప్పుతున్నాయి మళ్లీ ఇదే గాని రిపీట్ అయితే దానికి పర్యావసనం నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది అని తల్లి కొడుకులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. అప్పటికే కోపంగా ఉన్న దేవయాని రిషి ని ఒక్క మాటంటే కొట్టేస్తావా అని కోపంగా అడుగుతుంది. కొడతాను అని స్ట్రాంగ్ గా సమాధానం చెప్తుంది జగతి. నన్నైనా కొడతావా అని నిలదీస్తుంది దేవయాని.

79

అని చూడండి ఏం జరుగుతుందో అంటూ అంతే స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి. ఆమె సమాధానానికి షాక్ అవుతుంది దేవయాని. రిషి ని ఒక్క మాటంటేనే ఇంత తెగించిన జగతి ఎందుకు కొడుకు మీద ఇంత అపవాదు వేసింది.. ఏమి అర్థం కాకుండా ఉంది అని అయోమయంలో పడిపోతాడు మహేంద్ర. మరోవైపు వసు గురించి ఆలోచనలో ఉన్న రిషి నా గెలుపు కోసం నువ్వు ఓడిపోయే దానివి అలాంటిది ఒక చిన్న అబద్ధంతో నన్ను దూరం చేసుకున్నావు.
 

89

 నిన్ను, జగతి మేడం ని జీవితంలో క్షమించలేను అని అనుకుంటాడు. అదే సమయంలో వసు కూడా రిషి గురించి ఆలోచిస్తూ మన మధ్యన ఉన్నది అడ్డు గోడ కాదు మంచు తెర అది ఎప్పటికైనా తొలగిపోతుంది మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నా ప్రిన్సెసే అని మనసులో అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే పిన్ని ఇన్నాళ్లు మాట్లాడకుండా ఉంది అంటే రిషి కోసం అలాంటిదే రిషి ని ఏమైనా అంటే తన ఊరుకోదు.
 

99

 తనకి భయపడటం తెలుసు, భయపెట్టడం తెలుసు. మరి ఏం చేయటం అమ్మ.. నేను ఇంత చేసింది ఎం డి సీట్ కోసం అలాంటిది అదే నాకు దక్కటం లేదు అంటాడు శైలేంద్ర. అలాంటప్పుడు బాబాయ్ వైపు నుంచి నరుక్కు రా అతన్ని మన చేతిలో పెట్టుకుంటే అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయి అంటుంది దేవయాని. నాకు ఈ దువ్వటాలు అవి చేతకాదు అందుకే రిషి ని కూడా పైకి పంపించేసాను అని నిజం చెప్పేస్తాడు శైలేంద్ర. కొడుకు మాటలకి షాక్ అయిపోతుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories