చీరకట్టుకే అందం తెచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. జాలిలాంటి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఢిల్లీ భామ మెరుపులు

First Published | Jun 20, 2023, 10:09 AM IST

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సంప్రదాయ దుస్తుల్లో కట్టిపడేస్తోంది. మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించబోతున్న సందర్బంగా ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  మొన్నటి వరకు బాలీవుడ్ లో ఎంతలా సందడి చేసిందో తెలిసిందే. ఒకే ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో ప్రేక్షలను అలరించింది. బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.
 

కాకపోతే ఆ చిత్రాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రకుల్ పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనగా మారింది. అయితే, అప్పటికే సౌత్ లో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ వెనక్కి వస్తోంది. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాలపై శ్రద్ధ పెడుతోంది.
 


ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తూ దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 
 

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న ఢిల్లీ భామ తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. చీరకట్టులో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేసింది. స్లిమ్ ఫిట్ సొగసుతో చీరకట్టుకే అందాన్ని తెచ్చిపెట్టింది. లైట్ బ్లూ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.
 

మరోవైపు జాలి లాంటి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రకుల్ గ్లామర్ మెరుపులు కూడా మెరిసింది. శారీలో హోయలు పోతూ చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. అయాస్కాంతంలా కుర్ర హృదయాలను ఆకర్షించింది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే శివకార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. ఈ చిత్రం 2023 నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోకి మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.
 

Latest Videos

click me!