Divvala Madhuri: తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి, బిగ్ బాస్ స్టార్ సంచలన నిర్ణయం..

Published : Jun 03, 2026, 08:00 AM IST

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతోంది. ఆంధ్రా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి..దివ్వెల మాధురి, త్వరలో తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో దివ్వల మాధురి ఇమేజ్..

ఏపీ రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చిన దివ్వల మాధురి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యింది. పాలిటిక్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ తోనే మాధురి బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా.. ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది. కొన్ని రోజులు మాత్రం అందరితో కలుపుగోలుగా మాట్లాడి మంచితనం కూడా చూపించుకుంది. 

25
పాలిటిక్స్ లోకి మాధురి ఎంట్రీ ఎప్పుడు?

ఎప్పుడూ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్న దివ్వల మాధురి.. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటించడంతో పాటు చీరల వ్యాపారం చేస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తోంది దివ్వల మాధురి. 

35
రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన

రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్వల మాధురి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే అంశంపై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన రాజకీయ జీవితానికి ఆంధ్రాతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు మాధురి. 

45
తెలంగాణ రాజకీయాల్లోకి ఆంధ్ర ఫైర్ బ్రాండ్..

మాధురి మాట్లాడుతూ... ''ఆంధ్రప్రదేశ్‌లో దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారు.. నేను ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే ఆలోచన లేదు. ఒకవేళ ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తే తెలంగాణలోనే పోటీ చేస్తాను. తెలంగాణలో ఇప్పటికే నాకు రాజకీయంగా చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేనే వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ అధికారికంగా ఏదైనా పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వస్తే, నేనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తాను.'' అని మాధురి వెల్లడించింది. అయితే తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందనే విషయాన్ని మాత్రం మాదురి వెల్లడించలేదు.

55
తెలంగాణ రాజకీయాలంటే ఇష్టం..

దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణానికి తాను పూర్తి మద్దతు ఇస్తానని, ,ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు సపోర్ట్‌గా ఉంటానని, కానీ తన రాజకీయ ఆసక్తి మాత్రం తెలంగాణ వైపే ఎక్కువగా ఉందని మాదురి వెల్లడించారు. "నాకైతే తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి" అంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భవిష్యత్తులో దివ్వల మాధురి నిజంగానే రాజకీయాల్లోకి అడుగుపెడతారా? ఒకవేళ అడుగుపెడితే తెలంగాణలో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? అనే అంశాలపై చర్చ మొదలైంది.

Read more Photos on
click me!

Recommended Stories