మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల మొదటి వారంలో విడుదలైంది. ఈ చిత్రం రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా ఇది రేర్ మైల్ స్టోన్‌ని రీచ్ అయ్యింది.
రామ్ చరణ్ తన కెరీర్‌లో క్రీడాకారుడిగా చేసిన తొలి చిత్రం `పెద్ది`. తన ఊరు గుర్తింపు కోసం ఆట ద్వారా హీరో చేసిన పోరాటమే ఈ మూవీ. ఇందులో రామ్ చరణ్.. ఒక క్రికెటర్‌గా, ఒక కుస్తీ వీరుడిగా, మరోవైపు రన్నర్‌గా కనిపించాడు. మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. ఓ వైపు బాధ, మరోవైపు ఆవేదన, ఇంకోవైపు గెలవాలనే కసి ఆయనలో కనిపించాయి. హవభావాలతోనే ఎమోషన్స్ ని పలికించి మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాడు.
25
వీకెండ్‌లో పుంజుకున్న పెద్ది
ఇదిలా ఉంటే `పెద్ది` సినిమా బాక్సాఫీసు వద్ద మొదటి వారంలో మంచి వసూళ్లని రాబట్టింది. ఇక రెండో వారం కొంత డ్రాప్ ఉంది. సింగిల్ డిజిట్ నెంబర్లతో సత్తా చాటుతోంది. అయితే రెండో వారం వీక్ డేస్‌లో సినిమాకి వసూళ్లు తగ్గాయి. కానీ వీకెండ్‌లో పుంజుకోవడం విశేషం. ఇది టీమ్‌కి కొంత ఊపిరిపోసిన ఫీలింగ్ అని చెప్పొచ్చు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచాలను అందుకోవడం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కొంత డ్రై సినిమాగా నిలిచింది. ఇదే ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. హీరో పాత్రలో స్ట్రగుల్ ఉంది, కానీ ఎమోషన్స్ క్యారీ కాలేదని అనే టాక్ వినిపించింది.
35
పెద్ది మూవీ 11 రోజుల కలెక్షన్లు
అదే సమయంలో సినిమా అదిరిపోయిందని మెగా అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇలాంటి మిశ్రమ స్పందనతో రన్ అవుతున్న `పెద్ది` సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మరి 11 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, రెండు వారాల్లో ఈ మూవీ మూడు వందల కోట్ల మైల్ స్టోన్‌ని దాటేసింది. ఇప్పటి వరకు దీనికి రూ.307.98(308)కోట్లు వసూలు చేసింది. ఈ శనివారానికి ఈ మూవీ రూ.8.10కోట్లు రాబడితే, ఆదివారం 9.20కోట్లు సాధించింది. ఇది కేవలం ఇండియాలో మాత్రమే. ఇది సినిమాకి పెరిగిన ఆదరణకి నిదర్శనంగా చెప్పొచ్చు.
`పెద్ది` మూవీకి ఇండియాలో రూ.256కోట్ల గ్రాస్, రూ.216కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్‌లో సుమారు రూ.52కోట్లు రాబట్టింది. అయితే ఓవర్సీస్‌లో భారీగా డ్రాప్ అయ్యింది. ఇదే టీమ్‌ని కలవరపెడుతుంది. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కావడం విశేషం. అయితే ఈ సినిమాకి 500-1000కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయని భావించారు. కానీ లాంగ్ రన్‌లో ఇది కనీసం రూ.400కోట్లు కూడా రీచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం మాత్రమే ఈసినిమా ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర సినిమాలుండటంతో `పెద్ది` పూర్తి స్థాయిలో డ్రాప్ అయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా క్లోజింగ్ వసూళ్లు నాలుగు వందలకు చేరితో గొప్పగా చెప్పొచ్చు.
55
పెద్ది మూవీ సక్సెస్ టార్గెట్ ఇదే
పెద్ది సినిమా హిట్ కావాలంటే సుమారు రూ.220కోట్ల షేర్ రావాలి. ఇప్పటి వరకు సుమారు రూ.180కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. హిట్ కావాలంటే ఇంకా రూ.40కోట్ల వరకు షేర్ రావాలి. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ పది రోజుల్లో రూ.378కోట్లు రాబట్టినట్టు చిత్ర బృందం వెల్లడించింది.