I Will Find You
తన కుమారుడి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ తండ్రికి, తన కుమారుడు ఇంకా బతికే ఉండవచ్చనే ఆధారాలు లభిస్తాయి. నిజం తెలుసుకునేందుకు అతడు జైలు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. సామ్ వర్తింగ్టన్, బ్రిట్ లోయర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జూన్ 18
Oasis
స్పెయిన్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌లో అత్యంత ధనికుల జీవితాల చుట్టూ తిరిగే స్పానిష్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఒక వ్యక్తి అదృశ్యమైన ఘటనపై దర్యాప్తు ప్రారంభం కావడంతో అందరి ప్రణాళికలు తారుమారవుతాయి.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జూన్ 19
Color Book
భార్య మరణం తర్వాత తన 11 ఏళ్ల కుమారుడిని పెంచుతూ జీవితం సాగించే ఓ తండ్రి కథ ఇది. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని చూపించనున్నారు.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జూన్ 19
Husbands In Action
మాదకద్రవ్యాల ముఠా నాయకుడిని పట్టుకున్న ఓ పోలీసు అధికారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. అతని మాజీ భార్యను కిడ్నాప్ చేయడంతో ఆమెను రక్షించేందుకు ప్రమాదకరమైన మిషన్ చేపడతాడు. గాంగ్ మ్యుంగ్, జిన్ సన్-క్యూ, కిమ్ జి-సోక్, యూన్ క్యుంగ్-హో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జూన్ 19