సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం
ఈ సినిమాలో తిలోత్తమ షోమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, దియా మీర్జా లాయర్ భార్యగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆల్కెమీ ఫిల్మ్స్ నిర్మించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం సన్నీ డియోల్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, న్యాయపోరాటంతో పాటు మానవ సంబంధాలు, భావోద్వేగాలను కూడా చూపిస్తుందని దర్శకుడు చెప్పారు.
'మహరాజ్' విజయం తర్వాత నెట్‌ఫ్లిక్స్‌తో తన అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడిందని ఆయన అన్నారు. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, దియా మీర్జా, తిలోత్తమ షోమ్ లాంటి నటులను ఒకే కథలో చూపించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.