సైమా అవార్డ్స్ లో రెడ్ మిర్చీలా పాయల్ రాజ్ పుత్ ఘాటు అందాలు.. సెగలు పుట్టించే ఫోజులు వైరల్ 

First Published Sep 11, 2022, 12:50 PM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ కి జోడిగా నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం విడుదలై నిరాశపరిచింది. 

అలాగే మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా సన్నీలియోన్ నటిస్తుండడం విశేషం. ప్రారంభం నుంచి ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. 

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. 

తాజాగా పాయల్ రాజ్ పుత్ సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొంది. ఈ వేడుకలో పాయల్ రాజ్ పుత్ రెడ్ కార్పెట్ పై రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఎద సోయగాలతో కనువిందు చేసింది. హాట్ హాట్ గా థైస్ గ్లామర్ తో కుర్రాళ్ళని ఉడికించింది. 

సైమా అవార్డ్స్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ నుంచి పూజా హెగ్డే, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కృతి శెట్టి, నిధి అగర్వాల్ లాంటి స్టార్స్ హాజరయ్యారు. 

ఇంత బోల్డ్ గా పాయల్ రాజ్ పుత్ ఫోజులు ఇవ్వడం ఆమెకు కొత్తేమి కాదు. గత ఏడాది పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో జరిగిన పొరపాటు కారణంగా పాయల్ రాజ్ పుత్ విమర్శలు ఎదుర్కొంది. ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.

click me!