అది లేకపోతే వేస్ట్.. ప్రభాస్ హీరో అయ్యే ముందు కృష్ణం రాజు చెప్పిన మాటలు, వైరల్

First Published Sep 11, 2022, 11:00 AM IST

పెదనాన్న కృష్ణం రాజు మృతితో ప్రభాస్ తీవ్ర విషాదంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. శనివారం కృష్ణం రాజు ఆరోగ్యం విషమించడంతో ప్రభాస్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లారు. ఈ తెల్లవారుజామున కృష్ణం రాజు తుదిశ్వాస విడిచారు.

పెదనాన్న కృష్ణం రాజు మృతితో ప్రభాస్ తీవ్ర విషాదంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. శనివారం కృష్ణం రాజు ఆరోగ్యం విషమించడంతో ప్రభాస్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లారు. ఈ తెల్లవారుజామున కృష్ణం రాజు తుదిశ్వాస విడిచారు. దీనితో ప్రభాస్ తో పాటు కుటుంబ సభ్యులంతా శోకంలో ఉన్నారట. 

ప్రభాస్ తండ్రి మరణించిన తర్వాత కృష్ణం రాజే అన్నీ చూసుకున్నారు. ఇండస్ట్రీ వైపు ప్రభాస్ ని నడిపించారు. ప్రభాస్ చేసే సినిమాల విషయంలో కృష్ణం రాజు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూసి మురిసిపోవాలని కూడా కృష్ణం రాజు భావించారు. కానీ ఆ కోరిక తీరకుండానే మరణించారు. 

అయితే అభిమానులు ప్రభాస్, కృష్ణం రాజు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణల వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. కెరటం చిత్ర ఆడియో వేడుకకి ప్రభాస్ కృష్ణం రాజు ఇద్దరూ అతిథులుగా హాజరయ్యారు. కెరటం హీరో సిద్ధార్థ్ రాజ్ కుమార్.. కృష్ణం రాజు సోదరుడి కుమారుడే. 

ఈ చిత్ర ఆడియో లాంచ్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చే ముందు పెదనాన్న కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈ వేదికపై నిలబడి ఉన్నానంటే అందుకు కారణం పెదనాన్న గారు. మా ఫ్యామిలీకి ఆయనే కింగ్. నేను నానా తొలి సినిమా ఈశ్వర్ చేసే సమయంలో ఒకటే చెప్పారు. నువ్వు చేసే ప్రతి షాట్, నటన హిస్టరీలో ఉంటుంది .. సో జాగ్రత్తగా చేయి.. గుర్తుపెట్టుకో అని అన్నారు. 

హీరోగా రాణించడానికి హార్డ్ వర్క్ ముఖ్యం. కానీ క్యారెక్టర్ లేకుండా ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్ అని పెదనాన్న చెప్పారు. కృష్ణం రాజు మాట్లాడుతూ.. ప్రభాస్ ఈ రోజు నటుడిగా కొన్ని నేను కూడా చూసి నేర్చుకునేంత స్థాయికి ఎదిగాడు అని కృష్ణం రాజు అన్నారు. వెంటనే ప్రభాస్ మైక్ తీసుకుని అబద్దం.. అంతా బుస్ అని అంటాడు. అబద్దం చెప్పడం ఈ కృష్ణం రాజు జీవితంలోనే లేదు అంటారు. 

ప్రభాస్‌ పెళ్లిపై కృష్ణంరాజు స్పందించారు. గతంలో అమ్మాయిని చూస్తున్నామని చెప్పిన కృష్ణంరాజు `ప్రభాస్ పెళ్లి కోసం అంతా ఎదురుచూస్తున్నారగా.. తాను కూడా అందుకోసం ఎదురుచూస్తున్నానని.. అయినప్పుడు చూద్దామ`ని తాజాగా తెలిపారు. అంటే ఇప్పట్లో ప్రభాస్‌ పెళ్లి లేదని పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు.

కృష్ణం రాజు, ప్రభాస్ మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ వైరల్ గా మారుతోంది. ఈ క్లిష్ట సమయంలో దృడంగా ఉండు ప్రభాస్ అన్నా అంటూ అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. 

click me!