SIIMA 2022: సైమా వేదికపై పుష్ప ప్రభంజనం... ఉత్తమ నటుడితో పాటు పలు అవార్డ్స్ కైవసం, కంప్లీట్ లిస్ట్ ఇదే!

Published : Sep 11, 2022, 12:08 PM ISTUpdated : Sep 11, 2022, 12:10 PM IST

బెంగుళూరు వేదికగా సైమా 2022 వేదిక ఘనంగా ముగిసింది. సౌత్ ఇండియాకు చెందిన స్టార్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. తెలుగు విభాగం నుండి పుష్ప మూవీ అవార్డుల పంట పండించింది. పలు విభాగాల్లో సైమా అవార్డ్స్ సొంతం చేసుకుంది.

PREV
110
SIIMA 2022:  సైమా వేదికపై పుష్ప ప్రభంజనం... ఉత్తమ నటుడితో పాటు పలు అవార్డ్స్ కైవసం, కంప్లీట్ లిస్ట్ ఇదే!
SIIMA 2022

ఏకంగా ఆరు విభాగాల్లో పుష్ప సైమా అవార్డ్స్ గెలుపొందింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, డైరెక్టర్,  మ్యూజిక్, సపోర్టింగ్ రోల్, సాహిత్యం విభాగాల్లో పుష్పకు అవార్డ్స్ దక్కాయి.

210
SIIMA 2022


పుష్పరాజ్ గా డీగ్లామర్ రోల్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు అల్లు అర్జున్. పుష్ప చిత్రం ఆయనకు పాన్ ఇండియా హిట్ తో పాటు సైమా అవార్డు కట్టబెట్టింది. 

310

ఉత్తమ చిత్రంగా పుష్ప ఎంపికైంది. ఈ అవార్డును మైత్రికి మూవీ మేకర్స్ లో ఒకరైన నవీన్ యెర్నేని అందుకున్నారు. 
 

410

ఉత్తమ డైరెక్టర్ గా సుకుమార్ పుష్ప చిత్రానికి అవార్డు సొంతం చేసుకున్నారు. భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సుకుమార్ పుష్ప 2 కి సిద్ధం అవుతున్నారు.

510
SIIMA 2022

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజా హెగ్డే డిఫరెంట్ రోల్ ట్రై చేశారు. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఆమెను స్టాండప్ కమెడియన్ గా చూపించాడు. ఈ చిత్రంలో మంచి నటన కనబరిచినందుకు పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డు పొందింది.

610
SIIMA 2022

సౌత్ యూత్ ఐకాన్ గా విజయ్ దేవరకొండకు స్పెషల్ అవార్డు అందించారు. సైమా అవార్డ్స్ వేదికపై విజయ్ దేవరకొండ మెరిశారు. 
 

710
SIIMA 2022

ఉత్తమ డెబ్యూ హీరోయిన్ విభాగంలో కృతి శెట్టి అవార్డు గెలుపొందారు. ఉప్పెన చిత్రానికి గాను ఆమె అవార్డుకు ఎంపికయ్యారు. 
 

810
SIIMA 2022

ఉత్తమ నటుడు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు హీరో నవీన్ పోలిశెట్టికి దక్కింది. జాతిరత్నాలు చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 
 

910
SIIMA 2022

ఇక పుష్ప చిత్రానికి అద్భుతమైన స్వరాలు సమకూర్చిన దేవిశ్రీ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు సొంతం చేసుకున్నారు. పుష్ప విజయంలో సాంగ్స్ కీలకం కావడం విశేషం. 

1010

తెలుగు విభాగంలో సైమా 2022 అవార్డ్స్ లిస్ట్ 

ఉత్తమ చిత్రం: పుష్ప: ది రైజ్ (మైత్రి మూవీ మేకర్స్)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ నటి: పూజా హెడ్గే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

ఉత్తమ సహాయ నటుడు: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప: ది రైజ్)

ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)

ఉత్తమ సంగీత స్వరకర్త: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిరియాల (చిట్టి - జాతి రత్నాలు)

ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (జై బాలయ్య - అఖండ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)

ఉత్తమ తొలి నటుడు: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

ఉత్తమ తొలి నటి: కృతి శెట్టి (ఉప్పెన)

ఉత్తమ నూతన దర్శకుడు: బుచ్చి బాబు సన (ఉప్పెన)

ఉత్తమ తొలి నిర్మాత: సతీష్ వెగ్నేస (నాంధి)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)

ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)

Read more Photos on
click me!

Recommended Stories