ఆధ్యాత్మిక చింతనలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. నెట్టింట ఫొటోలు వైరల్.. స్పందించిన రాశీఖన్నా!

Published : Oct 29, 2022, 06:10 PM IST

గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) తాజాగా ఆధ్యాత్మిక చింతనతో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో దైవ సన్నిధిలో కనువిందు చేసింది. దీనిపై రాశీఖన్నా స్పందించింది.   

PREV
16
ఆధ్యాత్మిక చింతనలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. నెట్టింట ఫొటోలు వైరల్.. స్పందించిన రాశీఖన్నా!

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది గ్లామర్ బ్యూటీ రాజ్ పుత్ పాయల్. తొలిచిత్రంతోనే  బోల్డ్ పెర్ఫామెన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాట్ హీరోయిన్ గా ఆడియెన్స్ లో ముద్ర వేసుకుంది. 
 

26

అప్పటి నుంచి వరుసగా తెలుగు చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. కొన్ని చిత్రాల వరకు హవా చూపించిన ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గాయి. దీంతో వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకుంటోంది. 
 

36

సినిమాల పరంగా తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న పాయల్ రాజ్ పుత్ అభిమానులకు మరింతగా దగ్గర కావాలని చూస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు నిత్యం అందుబాటులోనే ఉంటోంది. సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటోంది. 
 

46

తాజాగా పాయల్ దైవ సన్నిధిలో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక చింతనతో ఆకట్టుకుంటోంది. రెడ్ చుడీదార్ లో వేంకటేశ్వరుడి  ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. నుదిట నామాలు పెట్టుకొని, రాధే, రాధే అని రాసుకొని దేవుడిని స్మరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. 
 

56

పాయల్ రాజ్ పుత్ తాజాగా పంచుకున్న ఫొటోలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ట్రెడిషనల్ లుక్ లో మరింతగా మెరిసిపోతున్నట్టు తెలిపారు. పాయల్ అందానికి రాశీఖన్నా (Raashi Khanna) కూడా ఫిదా అయ్యింది. ఈ సందర్భంగా ఫొటోలను లైక్ చేసి పాయల్ బ్యూటీని పొగిడేసింది.

66

కేరీర్ పరంగా పెద్దగా జోరు లేకపోయినా.. వచ్చిన అవకాశాలను మాత్రం పాయల్ సరిగ్గా వినియోగించుకుంటోంది. రీసెంట్ గా మంచు విష్ణు సరసన ‘జిన్నా’ (Ginna) చిత్రంలో నటించింది.  ఈ చిత్రం ద్వారా పెద్దగా పాయల్ కు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో ‘ఏంజెల్’, తెలుగులో ‘కిరాతక’ చిత్రాలో నటిస్తోంది. 
 

click me!

Recommended Stories