అయితే నేను చేసిన ప్రతి చిత్రం వర్కౌట్ అవుతోందా లేదా అనేది నా చేతుల్లో ఉండదు. అది అదృష్టం, విధిరాత పై కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా లోతుగా చర్చించుకుంటే.. ఆర్ఎక్స్ 100 సూపర్ హిట్ తర్వాత నన్ను చాలా మంది మిస్ గైడ్ చేశారు. దీనితో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. ఇండస్ట్రీకి అప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి అంత మెచ్యూరిటీ లేదు.