చీరలాంటి డ్రెస్ లో రష్మీ గౌతమ్ అదిరిపోయే లుక్.. ఖతర్నాక్ ఫోజులతో మతిపోగొడుతున్న స్టార్ యాంకర్

First Published | Jun 30, 2023, 8:10 PM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam)  బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్  ఆకట్టుకుంటున్నాయి. 
 

బుల్లితెర అందాల యాంకర్ గా రష్మీ గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పదేళ్లకు పైగా స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్ తో పాటు చలాకీతనం, అందంతో టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 

యాంకరింగ్ తోపాటు రష్మీ గౌతమ్ ఇంట్రో డాన్స్ లతోనూ మతులు పోగొట్టింది. గ్లామర్ ఒళకబోసి టీవీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే రష్మీ గౌతమ్ తొలుత నటిగా కెరీర్ ను ప్రారంభించినా యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది.
 


ప్రస్తుతం హీరోయిన్ గానూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినీ విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. 

మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లపై గ్లామర్ వల విసురుతూ వస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా రష్మీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

లేటెస్ట్ గా రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఫొటోల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. పర్పుల్ కలర్ లోని శారీలాంటి డ్రెస్ లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరుపులు మెరిపించింది. 

ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మత్తు ఫోజులతో మైమరిపించింది. అన్ని యాంగిల్లో ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తు చూపులు, బ్యూటీఫుల్ స్మైల్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 

రష్మీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉండటంతో తన పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ రష్మీ నయా లుక్ ను లైక్ చేస్తూ.. కామెంట్లతో ఆకాశానికి ఎత్తున్నారు. 
 

ఇక యంగ్ బ్యూటీ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే.. ఇటు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అలరించింది. హీరోయిన్ గానూ మూడు నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో కనిపించబోతోంది. 
 

Latest Videos

click me!